Begin typing your search above and press return to search.
అమరావతికి బెజవాడ.. గుంటూరు దూరమా? హైటెక్ సిటీని మరిచావా జగన్?
By: Tupaki Desk | 20 Sep 2022 12:30 PM GMT"అమరావతి ఇటు విజయవాడకు కానీ.. అటు గుంటూరు కానీ దగ్గరగా లేదు. వీటిలో ఎక్కడి నుంచి అయినా కనీసం 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దేనికీ దగ్గరగా లేని ప్రాంతంలో మౌలిక వసతుల కోసమే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది" అంటూ అసెంబ్లీలో రాజధాని అమరావతి మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇక్కడో విషయాన్ని చెప్పాలి. మనకు ఏదైనా విషయం నచ్చనప్పుడు.. ఇష్టం లేనప్పుడు మన మాటలు.. ఆలోచనలు అన్ని కూడా మనం నమ్ముతున్న వైపు నుంచే చూస్తాం తప్పించి.. అందుకు భిన్నంగా ఆలోచించం.
అందులోకి జగన్ లాంటి ముఖ్యమంత్రి తాను అనుకున్నది మాత్రమే జరగాలని కోరుకునే మొండి మనిషి. తనకు నచ్చని వాటి విషయంలో ఆయన కఠినంగా.. కటువుగా ఉంటారు. తనకంటే చిన్న వారిని సైతం అప్పుడప్పుడు అన్నా అనేందుకు పెద్దగా మొహమాటపడని ఆయన.. అందుకు భిన్నంగా తనకంటే వయసులో పెద్ద వారిని పేరు పెట్టి పిలుస్తుంటారని.. ఇదంతా జగన్ తీరును అర్థం చేసుకోవటానికి ఉపయోగపడే ఉదాహరణలుగా ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తుంటారు.
అమరావతి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన జగన్.. అందుకు భిన్నంగా ఆలోచించటానికి సుతారం ఇష్టపడరన్న విషయం తెలిసిందే. తాజాగా అసెంబ్లీలో అమరావతికి గుంటూరు.. విజయవాడ ఎంత దూరమో చూశారా? అంటూ ఆయన చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యపోక తప్పదు. కళ్ల ముందు హైదరాబాద్ మహానగరాన్ని చూస్తూ కూడా ఇలాంటి మాటలు అంటారా? అన్నది ప్రశ్న. హైదరాబాద్ విస్తీర్ణం ఏకంగా 4500 కిలోమీటర్లకు పైనే విస్తరించింది ఉంది. అంతదాకా ఎందుకు.. ఐటీ నగరిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పుడు హైదరాబాద్ లోని చాలా ప్రాంతాలకు చాలా దూరంగా ఉండే సదూరాన ఎందుకు ఏర్పాటు చేసినట్లు?
ఇవాల్టి రోజున ఐటీ నగరిలో ఉద్యోగం చేయటం కోసం అటు హయత్ నగర్ నుంచి ఇటు బోడుప్పల్ నుంచి వస్తున్న వారెందరో. అంతదాకా ఎందుకు మల్కాజిగిరి.. సుచిత్ర.. మేడ్చల్.. శామీర్ పేట నుంచి రోజువారీగా వచ్చిపోయే వారెందరు? అన్నింటికి మించి.. ఐటీ కారిడార్ ను ఏర్పాటు చేసిన ఇరవైఏళ్లకు.. కోర్ సిటీ వరకు నగరం విస్తరించటమే కాదు.. ఇవాల్టి రోజున సైబర్ నగరి మరెంతగా విస్తరించిందో చెప్పాల్సిన అవసరం లేదు.
అలాంటప్పుడు ఇవాల్టి రోజున అమరావతికి అటు విజయవాడ.. ఇటు గుంటూరు 40 కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు. కానీ.. రాజధాని ఏర్పాటై.. దాని కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతున్న కొద్దీ.. రెండు వైపులా ఉన్న మొత్తం 80 కిలోమీటర్లు రాజధాని నగరంగా డెవలప్ అయి.. అందులో ఇమిడిపోయే అద్భుత అవకాశం ఉంటుంది. అదే జరిగితే.. హైదరాబాద్ తర్వాత అద్భుతమైన నగరిగా అమరావతి నిలుస్తుంది.
ఎందుకంటే.. అమరావతికి 40కి.మీ. దూరంలో ఉంటే విజయవాడ ఇప్పటికే నగరంగా ఉంది. మరోవైపు 40కి.మీ. దూరంలో ఉండే గుంటూరు నగరంగా డెవలప్ అయి ఉంది. మధ్యలో ఉన్న అమరావతిని రెండు వైపుల నుంచి విస్తరించుకుంటూ వస్తే.. వచ్చే పాతికేళ్లలో ఒక భారీ రాజధాని కారిడార్ గా మార్పు చెందటానికి అవకాశం ఉండటమే కాదు..కొత్త జిల్లాల రూపంలో చూస్తే.. దాదాపు ఐదారు జిల్లాలు రాజధాని నగర పరిధిలోకి వచ్చేయటం ఖాయం. అదే జరిగితే.. అమరావతి ఏపీకి మరో హైదరాబాద్ గా మారుతుంది. అంతేకాదు.. తెలంగాణకు లేని మరో అవకాశం మనకు ఆ చివరన ఉన్న విశాఖ మరో నగరంగా డెవలప్ అవుతూ.. ఇంకో కొసకు ఉండే తిరుపతిని పర్యాటకంగా డెవలప్ చేస్తే.. ఏపీ ఎంతలా డెవలప్ అవుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
జగన్ వాదనను కొత్తగా నిర్మించిన రాజధాని నగరాలతో సోల్చి చూసినా విషయం ఇట్టే అర్థమవుతుంది. ఛత్తీస్ గఢ్ రాజధాని నయారాయ్ పూర్ ను రాయ్ పూర్ కు అనుకొని కట్టలేదన్నది మర్చిపోకూడదు. అంతదాకా ఎందుకు గుజరాత్ రాజధాని గాంధీ నగర్ ను అహ్మదాబాద్ పక్కనే కట్టలేదు. ఈ రెండు రాజధానులతో పోలిస్తే.. అమరావతి విజయవాడ నగరానికి అనుకొని ఉండే బ్యారేజ్ దాటిన వెంటనే అమరావతిలోని కోర్ లో ఉన్న ఉండవల్లి సరిహద్దుతో మొదలవుతుంది. క్రిష్ణా నదిపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే విజయవాడ నుంచి కోర్ రాజధానికి కేవలం 5 నిమిషాల దూరంలో ఉంటుంది. ఇంతటి అద్భుత అవకాశాన్ని వదిలేసి.. అమరావతిపై సీఎం జగన్ చేసే వాదనల్లో లాజిక్ అస్సలు కనిపించదని చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.