Begin typing your search above and press return to search.

బెజ‌వాడ రోడ్డు : ల‌గ‌డపాటి కోసం..వైసీపీ వ్యూహం !

By:  Tupaki Desk   |   25 April 2022 6:30 AM GMT
బెజ‌వాడ రోడ్డు : ల‌గ‌డపాటి కోసం..వైసీపీ వ్యూహం !
X
ఏపీ రాజ‌కీయాల్లో కేవీపీ, ఉండ‌వ‌ల్లి, ల‌గ‌డ‌పాటి వంటి వ్య‌క్తులు ఎందుక‌నో ఇళ్ల‌కే ప‌రిమితం అయిపోతున్నారు. ఉండ‌వ‌ల్లి మాత్రం అప్పుడప్పుడూ త‌న గొంతు లేదా గోడు వినిపిస్తూ ఉన్నారు. కేవీపీ మాత్రం ఫ‌క్తు కాంగ్రెస్ రాజ‌కీయాల్లో త‌ల దూర్చ‌న‌ని చెప్ప‌క‌నే చెబుతున్నారు. అధిష్టానం నిర్ణ‌య‌మే శిరోధార్యం అని అంటూనే అప్పుడ‌ప్పుడూ ఏపీ ప‌రిణామాల‌పై ఆరా తీస్తున్నారు అని స‌మాచారం.

జ‌గ‌న్ అనే వ్య‌క్తి కాంగ్రెస్ సీఎం అయితే బాగుండు అని కూడా ఆ మ‌ధ్య అని త‌రువాత సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు వైసీపీ, కాంగ్రెస్ జ‌ట్టు క‌డితే విజ‌య‌వాడ నుంచి ల‌గ‌డ‌పాటి పోటీచేసే అవ‌కాశాల‌ను కొట్టిపారేయ్య‌లేం.

ఎలానూ కేశినేని నాని ఈ సారి పోటీ చేయ‌క‌పోవ‌చ్చు క‌నుక తెలుగుదేశం అభ్య‌ర్థి ఎవ్వ‌రైనా స‌రే ల‌గ‌డ‌పాటిని దాటిపోవ‌డం కుద‌ర‌ని ప‌ని ! ఒక‌వేళ గ‌త ఎన్నిక‌ల్లో ప‌నిచేసిన మాదిరిగానే ఈ సారి కూడా టీడీపీ వైపున‌కే మొగ్గు చూపుతూ వెళ్తే ల‌గ‌డ‌పాటి అక్క‌డ కూడా బెర్తు కొట్టేయ‌డం ఖాయం. అందుక‌నో ఎందుక‌నో ఇవాళ విజ‌యవాడ కేంద్రంగా కొంత అల‌జ‌డులు అయితే మొద‌ల‌య్యాయి. ఇవి ఎందాక పోతాయి అన్న‌ది ఇప్పుడే చెప్ప‌లేం.

రాజ‌కీయాల్లో ఏమ‌యినా కావొచ్చు కనుక ల‌గ‌డ‌పాటి ఎంట్రీని న‌మ్మ‌వ‌చ్చు. రాజ‌కీయ స‌న్యాసంలో ఉన్న ఆయ‌న త‌రువాత మ‌ళ్లీ మాట మార్చి వైసీపీ గూటికే చేర‌వ‌చ్చు. ఎందుకంటే రాజ‌కీయంలో ఏం జ‌రిగినా అవ‌న్నీ దైవాధీనాలు. వ్య‌క్తులు మాత్రం నిమిత్త మాత్రులు. ఆ విధంగా ల‌గ‌డ‌పాటి రీ ఎంట్రీని ఇవాళ మీడియా హైలెట్ చేస్తోంది.

వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ అనే ఎమ్మెల్యేతో లంచ్ మీట్ జ‌రిపారు ఆయ‌న. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు జ‌గ‌న్ కోసం ఏకంగా ఓ ఏజెన్సీనే ఏర్పాటు చేస్తున్నారు చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి. ఇప్పుడు జ‌గ‌న్ కోసం ల‌గ‌డ‌పాటి ప‌నిచేస్తార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి క‌నుక ఈ సారి వైసీపీ మ‌రింత జోష్ తో ప‌నిచేయ‌డం ఖాయం అని తేలిపోయింది.

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపు కోసం ప‌రోక్ష రీతిలో ప‌నిచేసి, స‌ర్వేలు కూడా చేసిపెట్టిన ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఈ ఎన్నికల్లో వైసీపీ కోసం ప‌నిచేయ‌నున్నారా? ఏమో ! గుర్రం ఎగ‌రా వ‌చ్చు ! గ‌త ఎన్నిక‌ల్లో టీవీ 9 తో క‌లిసి జ్యోతిషం చెప్పిన ల‌గ‌డ‌పాటి ఈసారి స్టాండ్ మార్చి సాక్షితో క‌లిసి జ్యోతిషం చెబుతారా ? ఏమో ! గుర్రం ఎగ‌రా వ‌చ్చు ! గ‌త ఎన్నిక‌ల్లో ఏవేవో అయిపోతాయి అని జ‌గ‌న్ ను భ‌య‌పెట్టిన ల‌గ‌డ‌పాటి ఈ సారి మాత్రం చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా గొంతుక ఏమ‌యినా వినిపించ‌డం సాధ్య‌మా లేదా కేవ‌లం ఓ ఎన‌లిస్టుగానే మిగిలిపోతారా ? ఏమో గుర్రం ఎటు వెళ్తుందో ఏ ప‌రుగు అందుకుంటుందో ?