Begin typing your search above and press return to search.
బెజవాడ గ్యాంగ్ రేప్.. జగన్ సర్కార్ సీరియస్ యాక్షన్
By: Tupaki Desk | 22 April 2022 8:24 AM GMTవిజయవాడ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన ఏపీలో సంచలనమైంది. దీనిపై సీరియస్ గా స్పందించిన సీఎం జగన్ కఠిన చర్యలకు ఆదేశాలిచ్చారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించవద్దని.. బాధ్యులపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సీఎంవో అధికారులకు ఆదేశాలిచ్చారు.
ఇక బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. ఆ కుటుంబానికి రూ.10లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలని జగన్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణాలపై ఒక సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై వైద్యఆరోగ్యశాఖ కూడా చర్యలు ప్రారంభించింది.
ఇక సీఎం ఆదేశాలతో విజయవాడ ఆస్పత్రి సిబ్బందిపై సైతం చర్యలు తీసుకున్నారు. నిందితులు ఫాగింగ్ ఏజెన్సీకి చెందిన కార్మికులుగా గుర్తించి వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేశారు.
విజయవాడ ఆస్పత్రిలో సెక్యూరిటీ ఏజెన్సీకి, ఫాగింగ్ ఏజెన్సీకి టెర్మినేషన్ నోటీసు జారీ చేశారు. సీఎస్ ఆర్ఎంఓకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శాఖపరంగా దర్యాప్తునకు ఆదేశాలిచ్చారు. నివేదిక తర్వాత మరిన్ని చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించారు.
విజయవాడ వాంబే కాలనీకి చెందిన 23 ఏళ్ల యువతి మానసిక వికలాంగురాలు. విజయవాడ సింగ్ నగర్ కు చెందిన శ్రీకాంత్.. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈనెల 19న తాను పనిచేస్తున్న ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ పెస్ట్ కంట్రోల్ విభాగంలో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అక్కడే ఆమెను బంధించి వెళ్లిపోయాడు.
గదిలో బాధితురాలిని చూసిన ఒప్పంద కార్మికుడు చెన్న బాబూరావు, అతడి స్నేహితుడు పవన్ కలిసి ఆమెపై మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు.
రాత్రైనా కుమార్తె కనిపించకపోవడంతో యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె నంబర్ కు వచ్చిన కాల్ ఆధారంగా విచారణ జరపమని కోరినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ తర్వాత శ్రీకాంత్ కాల్ చేశాడని తెలుసుకొని అతడిని విచారించగా ప్రభుత్వాసుపత్రిలో వదిలేసినట్లు చెప్పాడు. అక్కడికి వెళ్లి తల్లిదండ్రులు చూడగా.. యువతిపై పవన్ అనే వ్యక్తి అత్యాచారం చేస్తున్నాడు. దీంతో అతడిని పట్టుకొచ్చి పోలీసులకు అప్పగించారు.
ఈ ఘోరం విజయవాడలో తీవ్ర కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ వద్ద వివిధ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం సీరియస్ అయ్యి సీఐ, ఎస్సైని సస్పెండ్ చేసింది. బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు.