Begin typing your search above and press return to search.
రష్యాకు మద్దతుగా బెలారస్ సైన్యం ?
By: Tupaki Desk | 28 March 2022 6:00 AM GMTరష్యాకు మద్దతుగా బెలారస్ సైన్యం కూడా యుద్ధ రంగంలోకి దిగబోతోందా ? అవుననే అంటున్నారు విశ్లేషకులు. క్షేత్ర స్ధాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఉక్రెయిన్ లోని తమ రాయబార కార్యాలయాన్ని ఈమధ్యే బెలారస్ ఖాళీ చేసేసింది. రష్యా సైన్యంతో చేతులు కలపటంలో భాగంగానే రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేసిందనే విషయం ఇపుడు బయపడింది.
ఇక్కడ గమనించాల్సిందేమంటే ఉక్రెయిన్ కు యూరోపు, నాటో దేశాల నుండి భారీగా అందుతున్న ఆయుధాలన్నీ బెలారస్ మీదుగానే వస్తున్నాయి. దీన్ని అడ్డుకోవాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసైడ్ అయ్యారు. అడ్డుకోవటం అంటే ఏదో నోటి మాటతో సాధ్యం కాదు. ఎందుకంటే నాటో, యూరోపు దేశాలతో బెలారస్ కు కూడా చాలా అవసరాలున్నాయి.
అందుకనే రష్యాతో చేతులు కలిపిన కారణంగా తమ గగనతలాన్ని మూసేస్తున్నట్లు బెలారస్ ప్రకటించాలి. అప్పుడు యూరోపు, నాటో దేశాల నుండి ఉక్రెయిన్ కు అందుతున్న ఆయుధాలకు బ్రేక్ పడుతుంది.
ఇదే సమయంలో రష్యా-బెలారస్ సైన్యాలు ఉక్రెయిన్లో దూకుడు పెంచే అవకాశాలున్నాయి. విషయం ఏదైనా రష్యా ఒత్తిడికి బెలారస్ లొంగిపోయిందనేది అర్ధమవుతోంది. ఇదే సమయంలో నాటో దేశాలకు నాయకత్వం వహిస్తున్న అమెరికా వైఖరి కూడా విచిత్రంగా ఉంది.
రష్యాపై అనేక ఆంక్షలను విధిస్తున్న అమెరికా మరోవైపు తనతో పాటు తన మిత్ర దేశాల తరపున ఉక్రెయిన్ కు భారీగా ఆయుధాలను, నిధులను అందిస్తోంది. అంటే ఎవరైనా రష్యాకు మద్దతుగా నిలిస్తే తప్పని చెబుతున్న అమెరికా అదే తప్పును తాను బాహాటంగా చేస్తోంది. దీన్నే పుతిన్ ఖండిస్తూ తనకు సాయపడే దేశాలను చూసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే బెలారస్ ను రంగంలోకి దించుతున్నది.
నిజానికి బెలారస్ పెద్ద సైన్యం కానీ, ఆయుధాలు కానీ ఏమీ లేవు. మొత్తం సైన్యం అంతా కలిపితే లక్షలోపే. ఆయుధాలు కూడా ఒకపుడు రష్యా ఆయుధాలే ఇపుడు బెలారస్ లో ఉన్నాయంతే. అయితే ఏదేమైనా దేశమంటే దేశమే కదా. అందుకనే బెలారస్ ను కూడా యుద్ధంలోకి దించబోతున్నారు.