Begin typing your search above and press return to search.

బెల్జియం యువ‌రాజున‌ని నిర్ల‌క్ష్యం చేయ‌గా..ఎవ‌రైతే నాకేంట‌ని సోకిన వైర‌స్‌!

By:  Tupaki Desk   |   31 May 2020 3:43 PM GMT
బెల్జియం యువ‌రాజున‌ని నిర్ల‌క్ష్యం చేయ‌గా..ఎవ‌రైతే నాకేంట‌ని సోకిన వైర‌స్‌!
X
విదేశాల్లో రాజకుటుంబాలను మ‌హ‌మ్మారి వైర‌స్ పట్టి పీడిస్తోంది. ఈ వైర‌స్ బారిన పెద్ద ఎత్తున రాజ కుటుంబాలు బ‌ల‌వుతున్నాయి. స్పెయిన్‌ యువరాణి మరియా థెరిసా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. తాజాగా బెల్జియం యువ రాజు కూడా వైర‌స్ బారిన ప‌డ్డాడు. లాక్‌ డౌన్ అమ‌ల్లో ఉన్నా తాను యువ‌రాజును.. త‌న‌కేమ‌వుతుంద‌ని నిబంధ‌న‌లు ఉల్లంఘించి పార్టీకి వెళ్ల‌గా.. త‌న‌కు ఎవ‌రైతే నాకేంట‌ని ఆ వైర‌స్ అత‌డికి సోకింది. పార్టీకి వెళ్ల‌డంతో అత‌డికి వైర‌స్ సోకింద‌ని బెల్జియం రాజకుటుంబం ప్రకటించింది.

బెల్జియం యువరాణి ఆస్ట్రిడ్ చిన్న కుమారుడు జొవాచిమ్ (28)‌ ఇంటర్న్‌షిప్‌ కోసం మే 26వ తేదీన బెల్జియం నుంచి స్పెయిన్‌కి వెళ్లాడు. ఇదే స‌మ‌యంలో దక్షిణ స్పెయిన్‌లోని కార్డోబాలో జరిగిన ఓ పార్టీలో పాల్గొన్నాడు. మొత్తం 26 మంది మిత్ర‌లు పాల్గొన్నారు. ఆ పార్టీలో రాజ కుమారుడు జొవాచిమ్ పాల్గొని సంద‌డి చేశారు. అయితే ఆ పార్టీ ముగిసిన రెండు రోజుల తర్వాత అత‌డికి వైరస్‌ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో పరీక్షలు చేయించుకోగా అతడికి పాజిటివ్ అని తేలింది. వైరస్‌ నిర్ధారణ కావ‌డంతో బెల్జియం ఉలిక్కిప‌డింది. అత‌డితో పాటు పార్టీలో పాల్గొన్న అందరినీ ఈ సంద‌ర్భంగా క్వారంటైన్‌ కు తరలించారు.

యువ‌రాజు లాక్‌ డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి తన మిత్రులతో పార్టీలో పాల్గొన్నాడు. 15 మంది కంటే ఎక్కువ మంది ఒకచోట గుమికూడవద్దని నిబంధనలు ఉన్నా వాటిని బేఖాత‌ర్ చేసి ఉల్లంఘించి పార్టీలో పాల్గొన్నాడు. దీనిపై రాజ‌కుమారుడిపై స్పెయిన్ పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించడంతో 10 వేల యూరోలు (రూ.8 లక్షలు) జ‌రినామానా చెల్లించాల్సిందే. బెల్జియం సింహాసనం కోసం పోటీ ప‌డుతున్న వారిలో జొవాచిమ్ కూడా ఒక‌రు. ఇప్పుడు నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డంతో కేసు న‌మోదైంది. ఈ నేప‌థ్యంలో అత‌డి రాజ‌రికం వంశ‌పారంప‌ర్యంగా ల‌భిస్తుందో లేదో వేచి చూడాలి.