Begin typing your search above and press return to search.

బెల్జియం మీడియాకు తుత్తర ఎక్కువా?

By:  Tupaki Desk   |   23 March 2016 4:40 PM GMT
బెల్జియం మీడియాకు తుత్తర ఎక్కువా?
X
భారీ విపత్తు మీద పడినప్పుడు మీడియా మరింత బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇక.. భారీ ఉగ్రదాడి జరిగి.. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురైన వేళ.. ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ.. అలాంటి సమయంలో తత్తరపాటుతో తుత్తరగా వ్యవహరించి అడ్డంగా బుక్ అయ్యింది బెల్జియం మీడియా. తాజాగా వరుస బాంబు పేలుళ్లతో బ్రసెల్స్ నగరం చిగురుటాకులా వణికిపోవటం తెలిసిందే.

ఈ సందర్భంగా ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రకటించటం సంచలనంగా మారింది. పోలీసుల అదుపులో ఉన్న వారికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో నేరుగా సంబంధాలు ఉన్నాయని మీడియా స్పష్టం చేయటంతోపాటు.. వారంతా ప్యారిస్ దాడులకు పాల్పడిన వారితో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న వారేనని తేల్చేసింది. ఈ ప్రచారం తీవ్ర కలకలానికి దారి తీసింది.

అయితే.. తాము వెల్లడించిన వార్తల్ని బెల్జియం మీడియా కొద్దిసేపటి తర్వాత వెనక్కి తీసుకోవటం గమనార్హం. పోలీసులు అనుమానిత ఉగ్రవాదులుని అదుపులోకి తీసుకోలేదని తేల్చగా.. ఈ మొత్తం వ్యవహారం మీద బెల్జియం పోలీసులు ఎలాంటి ప్రకటనా చేయకపోవటం గమనార్హం. ఉగ్రదాడి లాంటి దారుణ ఘటనలు చోటు చేసుకున్నప్పుడు తొందరపాటు ఏ మాత్రం మంచిది కాదన్న విషయాన్ని బెల్జియం మీడియా తెలుసుకుంటే మంచిది.