Begin typing your search above and press return to search.

గంట - కిటికీ .. మరణానికి ముందే సమాధి తయారీ?

By:  Tupaki Desk   |   24 March 2021 11:30 PM GMT
గంట - కిటికీ .. మరణానికి ముందే సమాధి తయారీ?
X
సాధరణంగా ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి కుటుంబ సభ్యులు సమాధి కట్టిస్తారు. కానీ, ఓ వ్యక్తి చనిపోకమునుపే సమాధి కట్టించుకున్నాడు. దానికి ప్రత్యేకంగా కిటికీ కూడా స్పెషల్ గా డిజైన్ చేయించుకున్నాడు. ముందుగా సమాధి కట్టించుకున్నాడు ఒకే , కానీ ఆ సమాధికి కిటికీ , గంట ఎందుకు చనిపోయిన తర్వాత ఆ కిటికీ నుంచి బయటకు వస్తాడా , అయితే, అతడు తన సమాధికి ఆ కిటికీ పెట్టించుకోవడం వెనుక చిన్న భయం ఉంది. ఇందుకు అతడు చెప్పిన కారణం కనుక తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే. ఇటీవల కొన్ని శవాలు స్మశానానికి చేరుకున్న తర్వాతో, అంత్యక్రియలు జరుగుతున్నప్పుడో లేచి కూర్చుంటున్నాయి. బతికున్న వ్యక్తులను కూడా చనిపోయారని వైద్యులు చెప్పడం వల్లే ఇలా జరుగుతోంది.

ఇలాంటి ఘటనలు జరగడానికి ముందే, అమెరికాలోని వెర్మాంట్‌ కు చెందిన డాక్టర్ తిమోతీ క్లార్క్ స్మిత్ అనే వ్యక్తి ముందు చూపుతో తన సమాధి తానే కట్టించుకున్నాడు. దానికి ప్రత్యేకంగా ఒక కిటికీ, గంటను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఒక వేళ బతికుండగానే తనని ఖననం చేస్తే, అవి పనికొస్తాయని, ప్రాణాలతో ఉంటే ఆ గంటను కొట్టి బయట ఉన్న వ్యక్తులను అప్రమత్తం చేయవచ్చనేది అతడి ప్లాన్. ఇది ఇప్పట్లో జరిగినది కాదు. ఈ సమాధిని ఏర్పాటుచేసుకున్న డాక్టర్ తిమోతీ 1893లోనే చనిపోయాడు. ఆ సమాధిలోనే తిమోతీని ఖననం చేశారు. ఆ సమాధి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. పైగా, ఇది టూరిస్ట్ అట్రాక్షన్ కూడా. ఈ విషయాన్ని @bobbiecurtislee అనే టిక్ ‌టాక్ యూజర్ వివరించింది. తిమోతీ మరణానికి ముందు తన సమాధికి సంబంధించిన మోడల్ తయారు చేయించుకున్నాడు. దీనికి ప్రత్యేకంగా పేటెంట్ కూడా తీసుకున్నాడు. మరణించకుండానే తనని ఖననం చేస్తే ఆ బెల్, కిటికీలు ఉపయోగపడతాయనేది అతడి ఉద్దేశం అని తెలిపింది.

తిమోతీని ఆ సమాధిలోనే పెట్టి ఖననం చేశారని ఆమె తెలిపింది. అయితే, ఆ తర్వాత అతడికి గంట కొట్టి సాయం కోరే అవకాశం కూడా రాలేదని తెలిపింది. అయితే, సమాధి లోపల చీకటిగా ఉండటం వల్ల అతడి శవాన్ని చూడటం కష్టమేనని తెలిపింది. అయితే, అతడు పెట్టించుకున్న కిటికీని బయట నుంచి చూడవచ్చని, వెర్మాంట్ ‌‌లో ని న్యూ హెవెన్ ‌లోని ఎవర్‌ గ్రీన్ స్మశానవాటికలో అతడి సమాధి ఉందని వెల్లడించింది. ఈ ఐడియా ఏదో బాగుంది కదూ. అయితే, ఈ సాంప్రదాయం అప్పట్లో చాలామంది పాటించేవారట. మరణం తర్వాత జీవితం ఉందని నమ్మేవాళ్లు సైతం ఇలా తమకు తోచిన విధంగా సమాధిలో ఏర్పాట్లు చేసుకొనేవారని చెప్తున్నారు.