Begin typing your search above and press return to search.

ఫైజర్​ వ్యాక్సిన్​తో పక్షవాతం.. పంపిణీ నిలిపేస్తారా?

By:  Tupaki Desk   |   12 Dec 2020 6:18 AM GMT
ఫైజర్​ వ్యాక్సిన్​తో పక్షవాతం.. పంపిణీ నిలిపేస్తారా?
X
అమెరికాకు చెందిన ఫైజర్​ వ్యాక్సిన్​ ఎంతో సక్సెస్​ అయ్యింది. బ్రిటన్​లో పంపిణీ చేసేందుకు ఆ దేశం అనుమతిచ్చింది కూడా. అయితే అమెరికాలో ఇంకా ఈ వ్యాక్సిన్​కు అనుమతి రాలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అన్ని దేశాలు ఈ వ్యాక్సిన్​ గురించే చర్చించుకుంటున్నారు. బ్రిటన్​ వ్యాక్సిన్​ పంపిణీనికి అనుమతి ఇవ్వడంతో.. పలు దేశాలకు చెందిన ధనవంతులు అక్కడికి వెళ్లి వ్యాక్సిన్​ వేయించుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం కొన్ని ట్రావెల్​ కంపెనీలు కూడా ఆఫర్లు ప్రకటించాయి. వ్యాక్సిన్​ వేయించుకొనేందుకు ఇండియా వాళ్లు కూడా బ్రిటన్​ పయనమయ్యారు.

ఈ నేపథ్యంలో ఫైజర్​ వ్యాక్సిన్​పై వచ్చిన ఓ వార్త ఆందోళన కలిగిస్తున్నది. ఈ వ్యాక్సిన్​ వేయించుకున్న నలుగురు వలంటీర్లకు ముఖ పక్షవాతం (బెల్​ పాల్సినే) రావడం అందుకు కారణం. వ్యాక్సిన్​ వేయించుకున్న వలంటీర్ల ముఖ కండరాలు ఎర్రబడ్డాయట. దీంతో పాటు వాళ్లు తాత్కాలికంగా బలహీనపడ్డారట. అంతేకా శరీరంలో కొన్నిచోట్ల వాపులు రావడం, మొహం బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపించినట్టు సమాచారం. అమెరికాలో ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్​కు అనుమతి ఇవ్వలేదు. బ్రిటన్​ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అయితే ఈ విషయంపై అమెరికా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. ట్రయల్స్​ నిలిపివేస్తారా? లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. బ్రిటన్​ కూడా ఈ విషయంపై స్పందించలేదు. కేవలం కొద్దిమందిలో మాత్రమే అటువంటి లక్షణాలు కనిపించాయని.. అవి కూడా ప్రాణాంతకం కాదని సైంటిస్టులు అంటున్నారు.