Begin typing your search above and press return to search.

బిలో 40.. ఆ కోరిక తీర్చుకుంటున్నారు..

By:  Tupaki Desk   |   28 Sep 2019 6:16 AM GMT
బిలో 40.. ఆ కోరిక తీర్చుకుంటున్నారు..
X
గానుగు ఎద్దులా రోజు ఉదయం ఆఫీసుకెళ్లి రోజంతా పనిచేసి రాత్రికి అలిసి సొలిసి ఇంటికి రావడమేనా? కాసింత మనసును ప్రశాంతం కావాలా వద్దా.? అందుకే ఇప్పుడు మధ్యతరగతి, కిందిస్థాయి ఉద్యోగులు, ఐటీ, ప్రభుత్వ ఉద్యోగులు కొత్తగా ఆలోచిస్తున్నారు.. తమలోని కోరికలను తీర్చుకునేందుకు కొత్తగా వచ్చిన డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు.

విదేశాలకు వెళ్లాలి.. అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేయాలి.. ఎంతసేపు ఇదే పనియేనా.? రాక్షసుడిలా పనిచేయడమేనా..? అందుకే అప్పు చేసైనా సరే విదేశాలకు వెళ్లి తనివి తీరా సంతోషంగా గడపాలని ఉద్యోగులు, యూత్ భావిస్తున్నారు.

అయితే విదేశాలకు వెళ్లాంటే లక్షలు కావాలి.? అవి ఎలా సర్ధాలి. ఇప్పుడే వారికి సమస్య కొన్నాళ్ల క్రితం వరకూ ఉండేవీ. బ్యాంకుల్లో అప్పు తీసుకుందామంటే సవాలక్ష కండీషన్లు, నిబంధనలు జాప్యంతో విదేశీయానం కల నెరవేరడం లేదు.

అందుకే తాజాగా మధ్యతరగతి, చిన్న ఉద్యోగాల వారి కలను నెరవేర్చడానికి డిజిటల్ రుణ వితరణ కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇవి ఉద్యోగి విదేశీయానానికి అయ్యే ఖర్చును నిమిషాల్లోనే ఖాతాల్లో వేస్తున్నాయి. నెలనెలా ఈఎంఐ రూపంలో వసూలు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీల రాకతో 40 ఏళ్లలోపు ఉద్యోగులంతా తమ విదేశీయాన కలను నెరవేర్చుకుంటున్నారని డిజిటల్ లెండింగ్ ఫ్లాట్ ఫామ్ ‘ఇండియా లెండ్స్’ ఒక అధ్యయనంలో తెలిపింది. ఇలా బ్యాంకుల అడ్డగోలు నిబంధనతో విసిగి వేసారిన జనాలు ఇప్పుడు డిజిటల్ రుణ వితరణ కంపెనీ రాకతో ఎంతవరకైనా అప్పు చేసి తమ కలలను తీర్చుకుంటుండడం విశేషం.