Begin typing your search above and press return to search.
కండరాలు పట్టేసినా.. జట్టును గెలిపించాడు
By: Tupaki Desk | 2 May 2017 2:04 PM GMTబెన్ స్టోక్స్.. ఇప్పుడు ఐపీఎల్ అభిమానుల నోళ్లలో నానుతున్న పేరిది. సోమవారం రాత్రి గుజరాత్ లయన్స్ జట్టుపై అతడి ఇన్నింగ్స్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఐపీఎల్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ గా ఇది కితాబందుకుంటోంది. పది పరుగుల్లోపే రెండు వికెట్లు కోల్పోవడమే కాక.. ఆ తర్వాత కూడా తడబడ్డ పుణె.. 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిందంటే అది స్టోక్స్ చలవే. అతను అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో మొండిగా నిలబడి.. అద్భుత పోరాటంతో పుణెను గెలిపించాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇన్నింగ్స్ మధ్యలో అతడికి తొడ కండరాలు పట్టేశాయి. చివరి ఓవర్ కు ముందు అతను బాధతో విలవిలలాడాడు. అయినా జట్టును గెలిపించి కానీ.. అతను మైదానాన్ని వీడలేదు. అతను బాధతో విలవిలలాడుతున్నప్పటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాజీ ఆటగాళ్లందరూ అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
మామూలుగా ఐపీఎల్ లో అసాధారణ ధర పలికిన ఆటగాళ్లు సరిగా ఆడరని పేరుంది. ఒక దశలో రూ.15 కోట్లకు పైగా ధర పలికి రికార్డు నెలకొల్పిన యువరాజ్ ఆ ధరకు న్యాయం చేయలేకపోయాడు. అతనే కాదు.. ఎక్కువ రేటు పలికిన ఆటగాళ్లందరిదీ ఇదే పరిస్థితి. ఐతే ఇందుకు స్టోక్స్ మినహాయింపుగా నిలుస్తున్నాడు. అతను ఫిబ్రవరిలో జరిగిన వేలంలో రూ.15 కోట్ల ధర పలికాడు. ఐతే ఆ ధరకు తగ్గ ఆటతో అదరగొడుతున్నాడు. సోమవారం నాటి మ్యాచ్ తో కలిపి అతను మూడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకోవడం విశేషం. ముందు బంతితో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన స్టోక్స్.. ఇప్పుడు బ్యాటుతోనూ చెలరేగిపోతున్నాడు. ప్రస్తుతం 10 మ్యాచుల్లో పుణె 6 విజయాలతో ప్లేఆఫ్ దిశగా దూసుకెళ్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/