Begin typing your search above and press return to search.

శార్దూల్ సిక్స్ కొట్టాక.. స్ట్రోక్స్ రియాక్షన్ నెవ్వర్ బిఫోర్

By:  Tupaki Desk   |   29 March 2021 10:30 AM GMT
శార్దూల్ సిక్స్ కొట్టాక.. స్ట్రోక్స్ రియాక్షన్ నెవ్వర్ బిఫోర్
X
మ్యాచ్ మాంచి ఊపులో సాగుతున్న వేళ.. తాను వేసిన బంతికి సిక్సర్ మళ్లిస్తే.. ఆ బౌలర్ కు పుట్టే మంట అంతా ఇంతా కాదు. అందులోకి ప్రత్యర్థి జట్టు స్కోర్ భారీగా ఉన్న వేళలో.. దాన్ని మరింత పెంచేలా ఫోర్లు.. సిక్సర్లు కొడుతుంటే.. సహనం కోల్పోవటం.. నోటికి పని చెప్పటం లాంటివి ఇప్పటివరకు చూసి ఉంటాం. అందుకు భిన్నంగా.. నెవ్వర్ బిఫోర్ అన్న సీన్ ఒకటి తాజాగా జరిగిన ఫూణె వన్డేలో చోటు చేసుకుంది.

చివరి ఓవర్ వరకు ఊరించిన విజయం టీమిండియా ఖాతాలోకి పడి.. వన్డే సీరిస్ ను సొంతం చేసుకునేలా మ్యాచ్ ఫలితం రావటం భారత అభిమానులకు ఆనందం కలిగించే అంశమే. ఈ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న కొన్నిపరిణామాలు మాత్రం ఆసక్తికరంగా సాగాయి. అన్నింటికి మించిన టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న 45వ ఓవర్లో చోటు చేసుకున్న సీన్ నెవ్వర్ బిఫోర్ అన్నట్లుగా సాగింది.

టీమిండియా సభ్యుడైన శార్దూల్ ఠాకూర్ పేరు విన్నంతనే.. తొలుత బ్యాట్స్ మెన్ గా.. తర్వాత పేసర్ గా మారిన వైనం గుర్తుకు వస్తుంటుంది. ఇటీవల కాలంలో మళ్లీ తనలోని బ్యాట్స్ మెన్ ను బయటకు తీస్తూ.. జట్టుకు పరుగుల వర్షాన్ని కురిపిస్తున్నాడు. తాజా మ్యాచ్ లో మూడు సిక్సర్లతో సహా కీలకమైన 30 పరుగులు చేయటం ద్వారా 300పరుగులకు జట్టు స్కోర్ ను దాటేలా చేశాడు. 45వ ఓవర్లో స్ట్రోక్స్ వేసిన నాలుగో బంతిని మిఢాప్ దిశగా శార్దూల్ సిక్సర్ గా మలిచాడు.

ఇలాంటివేళ.. బౌలర్ ఇరిటేట్ కావటం సహజం. అందుకు భిన్నంగా శార్దూల్ వద్దకు వచ్చిన స్ట్రోక్స్.. అతడి బ్యాట్ ను పట్టుకొని ఏమైనా ఉందా? అంటూ సరదాగా పరిశీలించిన వైనం అందరిని ఆకర్షించింది. సోషల్ మీడియాలోనూ ఆసక్తికర చర్చకు తెర తీసింది. ఏమైనా.. అనవసరమైన ఇరిటేషన్ కు గురి కాకుండా.. సిక్స్ కొట్టిన తర్వాత ఇంగ్లండ్ బౌలర్ స్ట్రోక్స్ స్పందించిన తీరు అందరి చేత మాట్లాడుకునేలా చేసిందని చెప్పాలి.