Begin typing your search above and press return to search.
రూల్స్ బ్రేక్ చేసిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్.. బంతికి ఉమ్మిరుద్దాడు..!
By: Tupaki Desk | 28 March 2021 12:30 AM GMTబంతిని షైన్ చేసేందుకు క్రికెట్ ప్లేయర్లు బంతికి ఉమ్మి రుద్దుతుంటారు. ఈ పద్ధతి ఎప్పటినుంచో ఉంది. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి కోరలు చాచిన ప్రస్తుత తరుణంలో క్రికెట్ లో కొత్త రూల్స్ తీసుకొచ్చారు. అందులో భాగంగా బంతికి ఉమ్మి రుద్దడం నిషేధం.. మొదటి సారి ఎవరైనా ఇలా చేస్తే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. రెండోసారి అదే తప్పు చేస్తే మాత్రం సదరు జట్టుకు ఐదు పరుగుల జరిమానా విధిస్తారు. ఇదిలా ఉంటే తాజాగా ఇంగ్లండ్ కు భారత జట్టుకు మధ్య వన్డే సీరిస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న రెండో వన్డే జరిగింది.
ఈ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సెలైవా ఉపయోగించాడు. బంతికి ఉమ్మి రుద్దాడు. ఈ ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో రీస్ టోప్లీ.. నాలుగో ఓవర్ రెండో బంతి వేసిన తర్వాత బాల్‌ను తీసుకున్న స్టోక్స్ సెలైవా రుద్దాడు. దీంతో అంపైర్ వీరేందర్ శర్మ అతడికి వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఘటన మరోసారి రిపీట్ అయితే జరిమానా తప్పదని హెచ్చరించాడు.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లకు 336 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ సెంచరీ చేశాడు. కానీ ఇంగ్లండ్ జట్టు చాలా తేలిగ్గా ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. భారత్ భారీ స్కోరు సాధించినప్పటికి బౌలర్లు ఎవ్వరూ పెద్దగా రాణించకపోవడంతే.. ఇంగ్లాండ్ తేలిగ్గా విజయం సాధించింది. కేవలం 43.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.బెయిర్ స్టో 124 పరుగులు తీయగా.. బెన్ స్టోక్స్ 99 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ చాలా తేలిగ్గా విజయం సాధించింది.