Begin typing your search above and press return to search.
బాంబు బ్లాస్ట్ కు ముందే బెనజీర్ పై కాల్పులు?
By: Tupaki Desk | 28 Dec 2016 7:20 AM GMTఅది 27 డిసెంబరు, 2007.. పాకిస్థాన్ లో మానవబాంబు.. ఫలితం బెనజీర్ భుట్టో మరణం. ఇది జరిగి తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన అనంతరం తాజాగా ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకూ ఆ వీడియోలో ఏముంది, మానవ బాంబు సంఘటనకు సంబందించి తాజాగా వెలుగులోకి వచ్చిన ఆ బాంబు లాంటి వార్త ఏమిటనే విషయంలోకి వెళ్దాం.
పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్యకు సంబందించి ఒక కొత్త కోణం బయటకొచ్చింది. మానవబాంబు దాడిలో బెనజీర్ భుట్టో మరణించింది అనే విషయం ప్రపంచానికి తెలిసిందే. అయితే.. ఆ మానవబాంబు దాడికి ముందే బెనజీర్ పై కాల్పులు జరిగాయనేది తాజా సంచలన వార్త! అవును... బాంబు బ్లాస్ట్ కు ముందే బెనజీర్ పై మూడు సార్లు కాల్పులు జరిగాయట. ఈ విషయాన్ని తాజాగా కొంత మంది వాదించడంతో పాటు దీనికి సంబంధించి సాక్ష్యాలు కూడా చూపెడుతున్నారు. బెనజీర్ సభాస్థలిలో తెల్ల దుస్తుల్లో ఉన్న వ్యక్తి తుపాకీతో బెనజీర్ భుట్టో పై మూడు సార్లు కాల్పులు జరిపాడనీ, ఆ తరువాతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందని స్థానికంగా కథనాలు వెలువడ్డాయి. దీనికి సంబంధించి వీడియో ఒకటి రిలీజైంది.
కాగా దేశ బహిష్కరణకు గురై - శిక్ష పూర్తి అయిన అనంతరం దుబాయ్ నుంచి పాకిస్థాన్ కు తిరిగొచ్చిన బుట్టో.. అనంతర ఎన్నికల్లో నాటి అధ్యక్షుడు ముషారఫ్ పై పోటీ చేసేందుకు రంగంలోకి దిగారు. సరిగ్గా ఆ ఎన్నికల సందర్బంగా రావల్పిండిలో జరిగిన ర్యాలీలో బెనజీర్ హత్యకు గురయ్యారు. అయితే అది మానవబాంబు ద్వారా జరిగిన హత్య అని, దానికి కారణం ముషారఫ్ అని అంతా భావించిన సంగతి తెలిసిందే. అయితే తాజా వీడియోతో బెనజీర్ హత్యకు మానవబాంబే కాదు, అంతకు ముందు తుపాకీ కాల్పులే ప్రధాన కారణం అని తెలుస్తుంది!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/