Begin typing your search above and press return to search.
మిస్ యూనివర్స్ అయితే మీకు వర్తించే ప్రయోజనాలు ఇవే..!
By: Tupaki Desk | 19 Dec 2021 6:33 AM GMTఎన్నో ఏళ్ల తరువాత మిస్ యూనివర్స్ కిరీటం భారత్ కు చేరుకుంది. సుమారు 21 ఏళ్లు వేచి చూసిన అనంతరం పంజాబ్ కు చెందిన 21 ఏళ్ల అమ్మాయి హర్నాజ్ సంధుకు ఆ కిరీటం దక్కింది. మిస్ యూనివర్స్ గా ఎదగడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొంటే గాని టైటిల్ గెలవడం సాధ్యపడదు. ఇలాంటి పరీక్షలను అన్నింటినీ నెగ్గింది హర్నాజ్ సంధు. అందుకే చివరికి విశ్వ సుందరిగా నిలిచింది.
ఈ టైటిల్ సొంతం చేసుకున్నప్పుడు హర్నాజ్ సంధుకు ఇచ్చిన విశ్వ సుందరి కిరీటం పూర్తిగా ఆమె సొంత కాదు. ఇది కేవలం ఓ ఆభరణంలా ధరించేందుకు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. అయితే ఇటీవల తెలిసిన దాని ప్రకారం సుమారు రూ. 38 కోట్ల వరకు ఉంటుంది. దీనిని వివిధ సందర్బాల్లో, ఫంక్షన్స్ లోనూ ధరించవచ్చు. ఈ ఏడాది పూర్తి అయిన వెంటనే దీనిని తరువాతి ఏడాది మిస్ యూనివర్స్ గా ఎంపిక అయిన వారికి అందజేయాలి. దానిపై ఆమెకు కేవలం ఏడాది వరకు మాత్రమే హక్కు ఉంటుంది. దీనితో పాటు విశ్వ సుందరిగా ఎంపిక అయిన యువతికి మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ వారు కొన్ని వసతుల, సౌకర్యాలు కల్పించారు. అవి ఏంటో చూద్దాం.
ఉచిత వసతి గృహం.. విశ్వసుందరిగా ఎంపిక అయిన వారికి సంస్థ న్యూయార్క్ నగరంలో ఉండే అత్యంత ఖరీదైన అపార్ట్ మెంట్ లో ఉచితంగా వసతి ఏర్పాటు చేస్తారు. అదే అపార్ట్ మెంట్ లో మరొకరు కూడా ఉంటారు. వారే మిస్ అమెరికా. వీరు ఇరువురు ఆ అపార్ట్మెంట్ లో ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఇందులో కావాల్సిన బట్టలు, నగలు ఇలా వారికి ఏం కావాలంటే అవి ఉచితంగా వాడుకోవచ్చు. అంతేగాకుండా వీరి కోసం ప్రత్యేకంగా ఓ మేకప్ ఆర్టిస్ట్ ను ఇతర పనుల కోసం అసిస్టెంట్ ను సంస్థ నియమిస్తుంది. అయితే వీరిని ఆమె ఇష్టం వచ్చినప్పుడు వాడుకోవచ్చు. ఇందుకు గానూ ఎటువంటి మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేగాకుండా ఆమె ఏదైనా పార్టీలకు వెళ్లేటప్పుడు వేయించుకునే సౌందర్య లేపనాలు అన్నింటినీ సంస్థ భరిస్తుంది.
ఒకసారి విశ్వ సుందరి అయితే వారి రేంజ్ మామూలుగా ఉండదు. ఆమె కోసం ప్రత్యేకంగా కాస్ట్యూమ్ డిజైనర్ ను ఏర్పాటు చేస్తుంది సంస్థ. అంతేగాకుండా ఆమె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునేలా పంటి డాక్టర్, చర్మ వ్యాధుల డాక్టర్ లాంటి వారిని ఏర్పాటు చేస్తుంది. వీరంతా ఆయా రంగాల్లో నిష్ణాతులు. అలాగే మిస్ యూనివర్స్ అయిన వారిలో చాలామంది మోడలింగ్ వైపు వెళ్తారు. ఇందుకుగానూ వారికి ఓ ఫొటోగ్రాఫర్ ను సంస్థ అరెంజ్ చేస్తుంది. మిస్ యూనివర్స్ గా ఉన్న వారికి లభించే మరో చక్కని అవకాశం వరల్డ్ టూర్. వారు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండాలి అనుకుంటే అక్కడకు వెళ్లి రావచ్చు.
ఇందుకు పూర్తిగా సంస్థ ప్రతీ చిన్న ఖర్చును భరిస్తుంది. అయితే వీరికి లభించే వేతనం పై స్పష్టమైన సమాచారం ఎవరి దగ్గరా లేదు. కానీ లక్షల్లో వస్తుంది అని అందరూ చెప్తుంటారు. వీరికి అదనంగా వచ్చే వాటిలో మరోకటి ప్రైజ్ మనీ. సుమారు 1.80 కోట్లు ఇస్తారు. ఈ మొత్తాన్ని ఆమె తనకు ఇష్టం వచ్చినట్లు చేయచ్చు. ఇదిలా ఉంటే మిస్ యూనివర్స్ గా ఎన్నికైన వారిని సంస్థ కూడా బాగానే ఉపయోగించుకుంటుంది. సంస్థ నిర్వహించే పార్టీలకు, సామాజిక కార్యక్రమాలకు, ఇతర ప్రెస్ మీట్ లకు వారితో పాటు హాజరు కావాల్సి ఉంటుంది.