Begin typing your search above and press return to search.

మద్దతిచ్చినా మోడీ షాక్ తప్పలేదా ?

By:  Tupaki Desk   |   24 July 2022 6:38 AM GMT
మద్దతిచ్చినా మోడీ షాక్ తప్పలేదా ?
X
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వ్యవహారం చూస్తే వ్రతమూ చెడింది.. ఫలితమూ దక్కలేదు అన్నట్లుగా తయారైంది. బెంగాల్ గవర్నర్ కు పనిచేసిన జగదీప్ ధనకర్ కు మమతకు మధ్య సంబంధాలు ఉప్పునిప్పులాగ ఉండేవన్న విషయం అందరికీ తెలిసిందే. ఇద్దర ఎదురుపడి ప్రత్యక్షంగా ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవటం మాత్రం జరగలేదంతే. అంతస్ధాయిలో ఇద్దరిమధ్య గొడవలుండేవి. అలాంటిది ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే తరపున పోటీచేస్తున్న ధనకర్ కు మమత మద్దతిస్తున్నారు.

డైరెక్టుగా ధనకర్ కు మమత మద్దతివ్వకపోయినా ఉపరాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించాలనే నిర్ణయంతో పరోక్షంగా గెలుపుక మద్దతిచ్చినట్లే అయ్యింది. ఇంతటి సానుకూల నిర్ణయం వెనుక కొద్దిరోజుల క్రితం అస్సాం సీఎం హిమాంత్ బిస్వాస్ సమక్షంలో మమత-ధనకర్ భేటీ జరిగింది. ఈ భేటీకి సూత్రదారి నరేంద్రమోడీయే అని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. ఉపరాష్ట్రపతిగా ధనకర్ ను గెలిపించటమే అంశంగా ఈ భేటీ జరిగినట్లు అర్ధమవుతోంది.

బద్ధశతృవులాంటి మోడీ, ధనకర్ తో అసలు మమత ఎందుకు తెరవెనుక ఒప్పందం చేసుకున్నట్లు ? తనకు ఎలాంటి లాభమూ లేకుండానే మమత ధనకర్ గెలుపుకు సహకరిస్తారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏదో ఒప్పందం జరిగిన కారణంగానే మమత నాన్ ఎన్డీయే పార్టీలకు దూరమైనట్లు ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మమతకు అత్యంత సన్నిహితుడైన పరిశ్రమల శాఖ మంత్రి పార్ధాఛటర్జీని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఉన్నతాధికారులు అరెస్టుచేశారు. మంత్రితో పాటు ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ, మంత్రి పీఎస్ సుకాంతా ఆచార్య కూడా అరెస్టయ్యారు.

మోడీకి మమతకు కూడా ఏమాత్రం పడటంలేదు. అందుకనే తమ పార్టీవాళ్ళపై కేంద్ర దర్యాప్తు సంస్ధలు కేసులు నమోదులు చేస్తున్నట్లు మమత నానా రచ్చ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ధనకర్ తో భేటీ తర్వాత ఇక మమతతో పాటు ఆమె సన్నిహితుల జోలికి దర్యాప్తుసంస్ధలు వెళ్ళవని అందరు అనుకున్నారు. అలాంటిది దాడులు చేయటమే కాకుండా ఏకంగా అరెస్టులు కూడా చేశారంటే ఆశ్చర్యంగా ఉంది.