Begin typing your search above and press return to search.

అమిత్‌ షా త‌ర్వాత యోగి...మమ‌తా షాకుల ప‌రంప‌ర‌

By:  Tupaki Desk   |   3 Feb 2019 12:18 PM GMT
అమిత్‌ షా త‌ర్వాత యోగి...మమ‌తా షాకుల ప‌రంప‌ర‌
X
భార‌తీయ జ‌న‌తాపార్టీకి వ‌రుస షాకుల ప‌రంప‌ర కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరో బీజేపీ నేతకు షాకిచ్చారు. సేవ్ డెమొక్రసీ పేరుతో వచ్చే ఏడాది జరగబోయే లోక్‌ సభ ఎన్నికలకు ముందు మూడు ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ భావించింది. ఈ క్ర‌మంలో రాష్ట్రానికి రావాల్సి ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా హెలికాప్టర్ ల్యాండింగ్‌ కు అనుమతి ఇవ్వని ఆమె.. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ను కూడా రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వలేదు. దీనిపై బీజేపీ శ్రేణులు భ‌గ్గుమంటున్నాయి.

బెంగాల్‌ లోని బాలూర్‌ ఘాట్‌ లో ఆదివారం సాయంత్రం జరిగే ర్యాలీ కోసం యోగి రావాల్సి ఉంది. అయితే తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే హెలికాప్టర్ ల్యాండింగ్‌ కు అనుమతి ఇవ్వలేదని యోగి కార్యాలయం వెల్లడించింది. యోగికి ఉన్న పాపులారిటీ కారణంగానే మమత కనీసం ఆయన హెలికాప్టర్‌ ను కూడా ల్యాండ్ కానీయలేదని యోగి ఆదిత్యనాథ్ సమాచార సలహాదారు మృత్యుంజయ్ కుమార్ అన్నారు. యోగి హెలికాప్టర్ ల్యాండింగ్‌ కు అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ కార్యకర్తలు నిరసన తెలుపుతున్నట్లు బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చెప్పారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో బీఎస్‌ ఎఫ్‌ కు చెందిన రాయ్‌ గంజ్ క్యాంప్‌ లో యోగి హెలికాప్టర్ ల్యాండ్ కానుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన బాలూర్‌ గాట్‌ కు రానున్నారు.