Begin typing your search above and press return to search.

కంగ‌నాపై బెంగాల్ పోలీసుల యాక్ష‌న్‌

By:  Tupaki Desk   |   8 May 2021 4:50 AM GMT
కంగ‌నాపై బెంగాల్ పోలీసుల యాక్ష‌న్‌
X
బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ పై కోల్ క‌తా పోలీసులు కేసు పెట్టిన‌ట్టు స‌మాచారం. సోష‌ల్ మీడియాలో మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టింద‌నే ఫిర్యాదు మేర‌కు ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ప‌శ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం.. సోష‌ల్ మీడియాలో వ‌రుస పోస్టులు పెట్టింది కంగ‌నా. ఇందులో ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. ఈ వ్యాఖ్య‌లు త‌మ నిబంధ‌న‌లకు వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని, ప‌లుమార్లు ఇదేవిధంగా ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డిందంటూ ట్విట‌ర్ ఆమె ఖాతాను శాశ్వ‌తంగా ర‌ద్దు చేసింది.

తాజాగా.. పోలీసులు కూడా యాక్ష‌న్ తీసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ మేర‌కు తృణ‌మూల్ కాంగ్రెస్ ప్ర‌తినిధి రిజుద‌త్తా చేసిన ఫిర్యాదుతో కంగ‌నాపై కేసులు న‌మోదు చేసిన‌ట్టు స‌మాచారం. మ‌మ‌తా బెన‌ర్జీ చిత్రాల‌ను వ‌క్రీక‌రించార‌ని ఫిర్యాదులో పేర్కొన్న‌ట్టు స‌మాచారం.

దీంతో.. ఐపీసీ 153ఏ, 504, 505 సెక్ష‌న్ల‌తోపాటు.. ఐటీ చ‌ట్టంలోని 43, 66 సెక్ష‌న్ల‌పై కేసు పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. అయితే.. దీనిపై కంగాన స్పందిస్తూ.. త‌న గొంతు నొక్కేస్తున్నార‌ని వ్యాఖ్యానించిన‌ట్టుగా తెలుస్తోంది. కేసులు, సెక్ష‌న్ల‌తో త‌న‌ను భ‌య‌పెట్ట‌లేర‌ని చెప్పుకొచ్చిన‌ట్టు స‌మాచారం.