Begin typing your search above and press return to search.

ఆ వార్తల పై బంగాల్ టైగర్ ఫైర్!

By:  Tupaki Desk   |   5 Feb 2022 2:30 AM GMT
ఆ వార్తల పై బంగాల్ టైగర్ ఫైర్!
X
భారత్ లో క్రికెట్ కు ఉన్నంత క్రేజ్ మరే ఆటకు ఉండదు. అందుకే క్రికెటర్స్ గురించి చిన్న వార్త వచ్చినా సరే సమాజం దానిని భూతద్దంలో పెట్టి మరీ చేస్తుంది. ఇంకా పర్సనల్ విషయాల గురించి చెప్పనక్కర్లేదు. అంతగా మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది. ఇటీవల కాలంలో బాగా మీడియా ఫోకస్ లోకి వచ్చింది ఇద్దరు వ్యక్తులు. వారిలో ఒకరు బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ అయితే మరో వ్యక్తి విరాట్ కోహ్లీ. అయితే టీం ఇండియాకు వన్డే కెప్టన్ గా ఉన్న విరాట్ ఈ మధ్య తప్పుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి సౌరవ్ పై చాలా విమర్శలు ఏదో ఒక రూపంలో వినిపిస్తూ వచ్చాయి. అయితే తాజాగా దాదాపై వచ్చిన ఓ విమర్శను తన దైన శైలిలో తిప్పి కొట్టాడు. తనకు ఎలా ఉండాలో ఎవరూ నేర్పించాల్సిన అవసరం లేదని.. బీసీసీఐ ప్రెసిడెంట్ గా తన బాధ్యత ఏంటో తనకు తెలుసునని ధీటుగా స్పందించాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే..?

కోహ్లీ, బీసీసీఐ సెక్రెటరీ జై షా, ఇతర సెలెక్షన్ కమిటీ సభ్యులు అందరూ కలిసి ఉండే ఓ ఫోటో ఇటీవల బయటకు వచ్చింది. దీనిని ఆధారంగా చేసుకుని ప్రెసిడెంట్ గా ఉన్న గంగూలీ.. టీం ఎంపికలో కలగజేసుకుంటున్నారని ఓ స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై దాదా స్పందిస్తూ.. గట్టిగా ఇచ్చిపడేశారు. తాను ఓ క్రికెట్ బోర్డుకు ప్రెసిడెంట్ అని చెప్పారు. ఇలాంటి చౌకబారు విమర్శలకు తాను స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. పిచ్చి పిచ్చి వార్తలపై వివరణ ఇచ్చుకోవాల్సి స్థానంలో తాను లేనని పేర్కొన్నారు. ప్రెసిడెంట్ గా తాను చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయని అన్నారు. కేవలం సెలక్షన్ కమిటీలో తాను ఉన్న ఫోటో పెట్టి ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేయడం తగదని హితవు పలికారు. ఇలా ఇష్టం వచ్చినట్లు రాసిన వార్తలను తాను ఖండిస్తున్నట్లు చెప్పారు.

భారత్ తరఫున నాలుగు వందలకు పైగా అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన తనకు తాను ఏం చేయాలో, ఏం చేయకూడదో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. కేవలం జై షా, కోహ్లీ, సెలక్షన్ కమిటీతో కలిసి కూర్చుంటో వారితో మీటింగ్ కు హాజరు అయినట్లు ఎలా చెప్పగలరు అని ప్రశ్నించారు. అందుకే ఇలాంటి వాటికి స్పందించాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.