Begin typing your search above and press return to search.
ఆ హీరోయిన్ బీజేపీలో జాయిన్ అయ్యింది !
By: Tupaki Desk | 2 March 2021 9:30 AM GMTపశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదలయింది. ప్రచారంలో బీజేపీ, టీఎంసీ పార్టీలు హోరాహోరీగా ప్రచారంలో ముందుకు సాగుతున్నాయి. మరోవైపు నేతల జంపింగ్ లు , సెలబ్రిటీల చేరికలతో బెంగాల్ రాజకీయాలు రోజు రోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. సినీ నటులు, క్రీడా ప్రముఖకులు రాజకీయాల్లోకి వస్తున్నారు. తాజాగా బెంగాలీ స్టార్ హీరోయిన్ స్రబంతి ఛటర్జీ బీజేపీలో చేరారు.
కోల్ కతాలో జరిగిన బీజేపీ ప్రచార సభ వేదికగా..ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 33 ఏళ్ల స్రబంతి ఛటర్జీ ఇప్పటి వరకు 30కి పైగా బెంగాలీ చిత్రాల్లో నటించారు. పలు సీరియళ్లు, వెబ్ సిరీస్‌ల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.బ్రవరి 25న బెంగాలీ నటి పాయెల్ సర్కార్ కూడా కాషాయ దళంలో చేరారు. ఆ తర్వాత కొన్ని రోజులకే స్రబంతి కూడా బీజేపీ గూటికి చేరారు. బెంగాల్ రాజకీయాల్లో సినీ నటులు చాలా మంది ఉన్నారు.
గత బుధవారం టీమిండియా మాజీ క్రికెటర్లు మనోజ్ తివారి, అశోక్ దిండా కూడా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మనోజ్ తివారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరగా.. అశోక్ దిండా బీజేపీ కండువా కప్పుకున్నారు. కాగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలయింది. మొత్తం 8 దశల్లో పోలింగ్ జరగనుంది. మొదటి దశ ఎన్నికలు - మార్చి 27న, రెండో దశ ఎన్నికలు - ఏప్రిల్ 1న, మూడో దశ ఎన్నికలు - ఏప్రిల్ 6, నాలుగో దశ ఎన్నికలు - ఏప్రిల్ 10న, ఐదో దశ ఎన్నికలు - ఏప్రిల్ 17న, ఆరో దశ ఎన్నికలు - ఏప్రిల్ 22న, ఏడో దశ ఎన్నికలు - ఏప్రిల్ 26న, ఎనిమిదో దశ ఎన్నికలు - ఏప్రిల్ 29న జరగనున్నాయి.