Begin typing your search above and press return to search.
మీడియాపై పరువునష్టం దావా గెల్చిన హీరోయిన్
By: Tupaki Desk | 9 May 2019 4:04 AM GMTసాధారణంగా మీడియా అంటేనే అందరూ భయపడిపోతారు. తమ లోగుట్టులు అన్నీ ఎక్కడ బయటకు చెప్తారనే భయంతో.. ఎందుకైనా మంచిది అని అంటీ ముట్టనట్లుగా ఉండేవాళ్లు చాలామందే ఉన్నారు. ఇక సినిమా సెలబ్రిటీలు అయితే మీడియా అంటేనే వణికిపోతారు. ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు కూడా ఆతితూచి వ్యవహరిస్తుంటారు. అలాంటి మీడియాపై కోర్టులో గెల్చి అందరిచేత ప్రశంసలు అందుకుంది కన్నడ నటి రమ్య.
వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకకు చెందిన ఆసియానెట్ మరియు సువర్ణ న్యూస్‌పై ఆరేళ్ల క్రిం పరువు నష్టం దావా వేసింది రమ్య. దీనికి కారణం.. బెంగళూరుకు చెందిన ఆర్సీబీ జట్టుపై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీనికి రమ్య కూడా కారణం అంటూ సదరు మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. అయితే.. దీనిపై కోర్టుని ఆశ్రయించిన రమ్య.. తాను ఐపీఎల్ ఫస్ట్ సీజన్ నుంచి 5వ సీజన్ వరకు మాత్రమే ఆర్సీబీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నానని.. కానీ జట్టులో ఫిక్సింగ్ ఆరోపణలు 6వ సంవత్సరం నుంచి వచ్చాయని కోర్టుకి తెలిపింది. అలాంటప్పుడు ఫిక్సింగ్‌లో తన పాత్ర ఎలా ఉంటుందని ప్రశ్నించింది. అంతేకాకుండా.. ఇలాంటి కథనాలతో తన పరువుకి భంగం వాటిల్లిందని సదరు మీడియా సంస్థలపై 2013లో కేసు ఫైల్ చేసింది. ఆరేళ్ల పాటు కేసుని విచారించిన న్యాయస్థానం.. రమ్య పరువుకు భంగం కలిగించి నందుకు రూ.50 లక్షలు కట్టాలని మీడియా సంస్థలను ఆదేశించింది.
సాధారణంగా ఇలాంటి కేసుల్లో ఆరోపణలు వచ్చినప్పుడు చాలామంది లైట్ తీసుకుంటారు. కానీ రమ్య దేన్నీ ఈజీగా తీసుకునే టైప్ కాదు. అందుకే న్యాయంకోసం పోరాడి గెలిచింది. చాలామందికి స్ఫూర్తి నిచ్చింది. మీడియా స్వేచ్చ ముసుగులో కొన్ని సంస్థలు చాలామంది పరువుకు భంగం కలిగిస్తున్నాయి. అలాంటివారికి రమ్య ఘటన కాస్తైనా కనువిప్పు కలిగిస్తుందనే చెప్పాలి.