Begin typing your search above and press return to search.

కోర్టులో షాక్‌...గాలికి నో బెయిల్‌

By:  Tupaki Desk   |   10 Nov 2018 7:23 AM GMT
కోర్టులో షాక్‌...గాలికి నో బెయిల్‌
X
గనుల అక్రమ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి మరో మలుపు తిరిగింది. ఈడీ కేసు నుంచి బయటపడేసేందుకు రూ. 600 కోట్లు ఫ్రాడ్ చేసిన అంబిడెంట్ అనే సంస్థ నుంచి ఓ భారీ డీల్ కుదుర్చుకున్న గాలి... ఈ డీల్‌లో దాదాపు రూ. 21 కోట్లు చేతులు మారాయని ఆరోపణలుండగా... గాలి దాదాపు 57 కిలోల బంగారు కడ్డీలు కూడా పొందారని ఆరోపిస్తున్నారు. బెంగళూరు సెంట్రైల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రెండు రోజులు నుంచి గాలి జనార్ధన్‌ రెడ్డి కోసం వేట మొదలుపెట్టారు... ఆయన నివాసంలో సోదాలు చేయడంతో పాటు... ఎక్కడికీ పారిపోకుండా లుక్‌ ఔట్ నోటీసుల సైతం జారీ చేశారు. అయితే, గాలి జనార్ధన్‌ రెడ్డి న్యాయవాదులు బెంగళూరులో సెషన్స్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.

గాలి జ‌నార్ద‌న్ రెడ్డితో పాటు సన్నిహితుడు అలీఖాన్ కోసమూ పోలీసులు గాలిస్తున్నారు. అంబిడెంట్ అనే సంస్థను ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు నుంచి కాపాడేందుకు జనార్దనరెడ్డి ముందుకు వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిజానిజాలు తెలుసుకునేందుకు జనార్దన రెడ్డిని ప్రశ్నించాల్సి ఉన్నదని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ టీ సునీల్ కుమార్ చెప్పారు. ఆయన పరారీలో ఉన్నాడని వివ‌ర‌ణ ఇచ్చిన స‌మ‌యంలో గాలి జనార్ధన్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పిటిష‌న్‌ పై న్యాయ‌స్థానంలో విచార‌ణ జ‌రిగింది. లంచం కేసులో గాలిది ఎటువంటి పాత్ర లేదని పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే సీబీబీ... గాలిపై చార్జిషీట్ దాఖలు చేసింది. కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులను మార్చాలని పిటిషన్‌ లో కోరారు. అయితే సీబీఐ అధికారులు జనార్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా - త‌న క్ల‌యింట్‌ కు బెయిల్ ద‌క్క‌లేద‌ని గాలి త‌ర‌ఫున న్యాయ‌వాది వెల్ల‌డించారు.