Begin typing your search above and press return to search.
టామ్ టామ్ సర్వే... బెంగళూరు నరకమేనట
By: Tupaki Desk | 30 Jan 2020 3:30 AM GMTబెంగళూరు... పేరు వినగానే అదేదో గ్రీన్ సిటీ అని, భాతర సిలికాన్ సిటీ అని, దేశంలో ఐటీకి కేంద్ర బిందువని చాలా గొప్పలే గుర్తుకు వస్తాయి. అయితే ఆ గొప్పలతో పాటు ట్రాఫిక్ చిక్కులు కూడా గుర్తుకు వస్తాయి. అంతేనా... ట్రాఫిక్ చిక్కుల్లో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరంగా మారిపోయిన నగరంగా బెంగళూరు ఇప్పుడు కొత్త కీర్తిని చాటుకుంది. ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక్ కలిగిన నగరంగా బెంగళూరు నిలిచింది. బెంగళూరులో ట్రాఫిక్ ఓ రేంజిలో ఉంటుందని తెలుసు గానీ... టామ్ టామ్ అనే మోటార్ నేవిగేషన్ సంస్థ చేసిన సర్వేలో... బెంగళూరు ట్రాఫిక్ ఎంత నరకమో ఇట్టే చెప్పేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ రద్దీ కలిగిన నగరంగా బెంగళూరు నిలిచిందంటే మాటలు కాదు కదా. సరే.. మరి ఆ సర్వే వివరాలు, అందులో బెంగళూరుకు దక్కిన స్థానం, బెంగళూరులో ట్రాఫిక్ ఏ మేర ఉంటుందన్న వివరాలను చూద్దాం పదండి.
ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన కీలక నగరాల్లో ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకునేందుకు టామ్ టామ్ అనే సంస్థ... గడచిన తొమ్మిదేళ్లుగా సర్వే చేస్తోంది. ఈ ఏడాది కూడా ప్రపంచంలోని 57 దేశాల్లోని 416 నగరాల్లో సర్వే చేసింది. ఈ సర్వేలో బెంగళూరు టాప్ పొజిషన్ లో కూర్చుంది. మన దేశానికి చెందిన మరో మూడు నగరాలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుని.... తమ పరిధిలో ట్రాఫిక్ చిక్కులు చాలానే ఉన్నాయని చెప్పకనే చెప్పాయి. వార్షికంగా 71 శాతం మేర ట్రాఫిక్ తో బెంగళూరు అగ్రస్థానంలో ఉంటే... 65 శాతం ట్రాఫిక్ తో ముంబై నాలుగో స్థానంలో, 59 శాతం ట్రాఫిక్ లో పుణే ఐదో స్థానంలో, 56 శాతం ట్రాఫిక్ తో దేశ రాజధాని ఢిల్లీ ఎనిమిదో స్థానంలో నిలిచాయి.
ఇక ఈ తరహా భారీ ట్రాఫిక్ తో బెంగళూరులో పరిస్థితులు ఎలా ఉన్నాయన్న విషయాన్ని కూడా టామ్ టామ్ సంస్థ చాలా విపులంగానే వివరించింది. బెంగళూరులో సగటున 71 శాతం ట్రాఫిక్ తో రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయని, ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లాలన్నా, తిరిగి ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లాలన్నా కూడా బెంగళూరు వాసులు నరకం చూస్తున్నారట. అదే 2019 ఆగస్టు 20వ తేదీని బెంగళూరు ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని పేర్కొన్న టామ్ టామ్... ఆ రోజున నగరంలో ఏకంగా 103 శాతం ట్రాఫిక్ నమోదు కాగా.. జనం గంటల పాటు రోడ్లపైనే నిలిచిపోక తప్పలేదట. ఇక అతి తక్కువ ట్రాఫిక్ నమోదైన రోజుగా 2019 ఏప్రిల్ 6వ తేదీ అని టామ్ టామ్ చెప్పింది. మొత్తంగా బెంగళూరు నగరం ట్రాఫిక్ కష్టాలతో అక్కడి ప్రజలు ఏ రీతి ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని టామ్ టామ్ చాలా స్పష్టంగానే చెప్పేసిందతి.