Begin typing your search above and press return to search.
బీఎంసీ సంచలన నిర్ణయం.. టెంపరేచర్‌తో పాటు వాసన పరీక్ష
By: Tupaki Desk | 28 July 2020 3:00 PM GMTవైరస్ భయంతో మాల్స్ ప్రతికూల పరిస్థితుల మధ్య తెరుచుకుంటున్నాయి. షాపింగ్.. వినోదానికి చిరునామాగా మాల్స్ ఉన్నాయి. అయితే లాక్‌డౌన్ తర్వాత తెరుచుకున్న కూడా అంతగా మాల్స్ లో సందడి లేదు. గతంలో మాదిరి ప్రజల రాకపోకలు లేవు. అయినా కూడా మాల్స్ తెరుచుకుంటున్నాయి. ఈ సమయంలో బెంగళూరు మున్సిపాలిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. వైరస్ బాధితులను గుర్తించేందుకు ఇప్పటికే టెంపరేచర్ చూడడం తప్పనిసరిగా మారింది. అయితే టెంపరేచర్ పరిశీలిస్తే సాధారణ జ్వరం వారు కూడా ఉండవచ్చు. అసలైన వైరస్ బాధితులను గుర్తించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. టెంపరేచర్ చెకింగ్‌తో పాటు వాసన పరీక్ష కూడా నిర్వహించనున్నారు. ముక్కుతో ఆ వాసన పక్కాగా చెబితే వదులుతారు. లేదంటే వెనక్కి పంపనున్నారు.
బెంగళూరులో షాపింగ్ మాల్స్‌లోకి వచ్చే వారికి టెంపరేచర్‌తో పాటు స్మెల్ టెస్ట్ కూడా చేయాలని మేయర్ గౌతమ్ కుమార్ నిర్ణయించారు. ఎవరైనా వాసనను గుర్తించలేకపోతే.. వారికి వైరస్ సోకినట్లేనని ఆయన పేర్కొన్నారు. మాల్స్‌లోకి వచ్చే వారు ఎవరైనా వాసన పరీక్షలో విఫలమైతే వారిని లోనికి అనుమతించకండి అని మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. వైరస్ బాధితులు రుచి, వాసన గుర్తించలేరు అని వివరించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి లేఖ రాస్తానని తెలిపారు. మాల్స్‌లో వాసన పరీక్షలు చేయడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వైరస్ సోకితే జ్వరం, గొంతు నొప్పి వంటి సాధారణ లక్షణాలతో పాటు వాసన, రుచి కోల్పోవడం వంటి వాటివి కూడా ఉంటాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపినట్లు గుర్తుచేశారు.