Begin typing your search above and press return to search.

బెంగళూరు అమ్మాయిని అలా చేసినోడు ఎవరంటే..

By:  Tupaki Desk   |   5 Jan 2017 9:56 AM GMT
బెంగళూరు అమ్మాయిని అలా చేసినోడు ఎవరంటే..
X
గార్డెన్ సిటీగా.. సెక్యూర్డ్ సిటీగా బెంగళూరుకు ఉన్న పేరు మొత్తం బర్ బాత్ అయ్యే ఘటనలు ఈ ఏడాది డిసెంబరు 31న చోటు చేసుకున్న ఉదంతం తెలిసిందే. న్యూఇయర్ వేడుకల సందర్భంగా వీధుల్లోకి వచ్చిన అమ్మాయిల పట్ల ఆరాచకంగా వ్యవహరించటమే కాదు.. వారిపై శారీరక దాడికి పాల్పడిన మృగాళ్ల ఉదంతం ఒక ఎత్తు అయితే.. అదే రోజు రాత్రి.. తన ఇంటికి కూతవేటు దూరంలో ఆటో దిగిన ఒక అమ్మాయిని.. టూవీలర్ మీద వచ్చిన కుర్రాళ్లు చేసిన దారుణం సీసీ కెమేరా ఫుటేజ్ పుణ్యమా అని బయటకు రావటం తెలిసిందే.

ఈ వీడియోతో బెంగళూరుకు ఉన్న కొద్దోగొప్పో మంచి పేరు మొత్తం కావేరీలో కలిసిపోయిన దుస్థితి. ఒక అమ్మాయిని ఒక వీధిలో రోడ్డు మధ్యలో బలవంతంగా పట్టుకోవటం.. ఆమె విడిపించుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా.. దుర్మార్గంగా వ్యవహరించిన వైనం పెను సంచలనంగా మారటంతో పాటు.. షాకింగ్ గా మారింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న బెంగళూరు పోలీసులు.. ఈ ఘోరానికి సంబంధం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

తమదైన శైలిలో విచారించగా.. వారు తాము చేసిన దారుణాన్ని ఒప్పుకున్నారు. మరింత షాకింగ్ విషయం ఏమిటంటే.. రోడ్డు మీద అమ్మాయి పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించిన కుర్రాడు ఎవరో కాదు.. బాధిత మహిళ తరచూ వెళ్లే షాపులో పని చేసే కుర్రాడేనట. ఆ అమ్మాయి మీద కన్నేసిన మృగాడు ఇంత దారుణానికి ఒడిగట్టటం ఒక ఎత్తు అయితే.. ఇదంతా చూసిన వాళ్లు కూడా ఆ దుర్మార్గాన్ని ఆపే ప్రయత్నం చేయని వైనం సీసీ ఫుటేజ్ లో నమోదైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/