Begin typing your search above and press return to search.

వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భర్తపై వేడి నూనె పోసింది

By:  Tupaki Desk   |   14 Feb 2020 2:30 AM GMT
వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భర్తపై వేడి నూనె పోసింది
X
ఇంట్లో పెళ్లాం ఉంటే.. మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్న భర్త తీరుతో రగిలిపోయింది. తనను మోసం చేసిన భర్తకు గట్టిగా బుద్ది చెప్పాలనుకుందా భార్య. నిద్ర పోతున్న భర్త మీద మరుగుతున్న నూనెను మీద పోసిన వైనం తాజాగా వెలుగు చూసింది. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది.

ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న 40 ఏళ్ల మంజునాథ్ యశ్వంత్ పూర్ లోని మోహన్ కుమార్ నగర్ లో ఉంటున్నాడు. అతడికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. దీంతో.. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.ఇదిలా ఉండగా.. శనివారం ఇదే విషయం మీద దంపతుల మధ్య పెద్ద వాదులాట జరిగింది.

ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో దాదాపు లీటరు నూనెను బాగా మరిగించి.. నిద్ర పోతున్న భర్త మీద పోసి పిల్లల్ని తీసుకొని పారిపోయింది. ఊహించని పరిణామంతో షాక్ తిన్న మంజునాథ్.. మంటకు తట్టుకోలేక బయటకు పరుగులు తీశాడు. కాలిన గాయాలతో అరుస్తున్న అతడిని స్థానికులు ఆసుపత్రికి చేర్చారు. ప్రాణాపాయం లేదని చెప్పినా యాభై శాతం చర్మం కాలిపోవటంతో నరకం అనుభవిస్తున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.