Begin typing your search above and press return to search.
కారు ప్రమాదానికి 5 సెకన్ల ముందు ఏం జరిగిందో చెప్పిన బెంజ్ రిపోర్టు
By: Tupaki Desk | 10 Sep 2022 4:46 AM GMTదేశ వ్యాప్తంగా అందరిని షాక్ కు గురి చేసేలా చోటు చేసుకున్న టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కారు యాక్సిడెంట్ ఉదంతానికి సంబంధించి ఆయన ప్రయాణిస్తున్న బెంజ్ కారు ఒక మధ్యంతర నివేదిక సిద్దం చేసింది. లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన మెర్సిడెజ్ బెంజ్..
తాజా ప్రమాదాన్ని.. ఆ సందర్భంగా వెనుక భాగంగా కూర్చున్న ఇద్దరు (సైరన్ మిస్త్రీ.. స్నేహితుడు జహంగీర్ పండోల్) మరణించిన నేపథ్యంలో.. అసలేం జరిగింది? ఈ ప్రమాదానికి కారణం ఏమిటి? ప్రమాదం జరిగే సమయంలో అసలేం జరిగింది? లాంటి అంశాల్ని విశ్లేషిస్తూ తాజాగా ఒక మధ్యంతర నివేదికను సిద్ధం చేశారు.
యాక్సిడెంట్ కు ముందున్న పరిస్థితుల్ని పోలీసులకు బెంజ్ టీం వివరించినట్లుగా చెబుతున్నారు. రోడ్డు డివైడర్ డీ కొట్టటానికి ఐదు సెకన్ల ముందు కారుకు బ్రేకులు వేసినట్లుగా తాము గుర్తించినట్లుగా పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల్ని ముంబయి పోలీసులకు అందించారు. కారు ప్రమాదంలో అధికారుల విచారణకు తాము సహకరిస్తున్నట్లుగా బెంజ్ వెల్లడించింది.
గుజరాత్ నుంచి ముంబయికి వస్తున్న సమయంలో పాల్ ఘరర్ జిల్లాలో డివైడర్ ను ఢీ కొనటంతో.. సైరస్ మిస్త్రీ ఆయన స్నేహితుడు అక్కడికక్కడే మరణించటం తెలిసిందే. కారును డ్రైవ్ చేస్తున్న ప్రముఖ కార్డియాలజిస్టు అనహితా పండోల్.. ఆమె భర్త డేరియస్ పండోల్ కు తీవ్రగాయాల బారిన పడటం తెలిసిందే. బెంజ్ ఇచ్చిన నివేదికలో కారుయాక్సిడెంట్ కు గురి కావటానికి ఐదు సెకన్ల ముందు బ్రేకులు వేసినట్లుగా గుర్తించారు.
ప్రమాదానికి కొన్ని సెకన్ల ముందు కారు స్పీడ్ వంద ఉంటే.. బ్రేకులు వేసిన తర్వాత దాని వేగం గంటకు 89 కిలోమీటర్లకు తగ్గినట్లుగా చెబుతున్నారు. డివైడర్ ను ఢీ కొట్టటానికి కేవలం ఐదు సెకన్ల ముందు బ్రేకులు వేసినట్లుగా చెబుతున్నారు. ఇదిలాఉంటే..
ఈ ప్రమాదాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయటం కోసం హాంకాంగ్ నుంచి ఒక ప్రత్యేక టీం ముంబయికి చేరుకున్నారు. వారు.. కారు కండీషన్ మీదా.. ఇతర సాంకేతిక అంశాల మీదా అధ్యయనం చేస్తారని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.