Begin typing your search above and press return to search.
బెంజ్ ను దాటేసిన బీఎం డబ్ల్యూ..: ఐదేళ్లలో తొలిసారి
By: Tupaki Desk | 9 Jan 2022 10:30 AM GMTకార్లలో రారాజు మెర్సిడెజ్ బెంజ్. దీనిని ఎవరైనా కొనుగోలు చేశారంటే అతడు పెద్ద ధనవంతుడై ఉంటారు. ప్రపంచంలోనే లగ్జరీ కారుగా పెరు తెచ్చుకొన్న ఈ వాహనం ఎంత ఖరీదు ఉన్నా హాట్ కేకుల్లా అమ్ముుడుపోతుంది. కారు ప్రియుల మనసు దోచుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడళ్లతో మార్కెట్లోకి వస్తుంది. వ్యాపారవేత్తలు ఎక్కువగా ఇష్టపడే మెర్సిడెజ్ బెంజ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇండియాలోనూ సేల్స్ అదరహో అనిపించే మెర్సిడెజ్ బెంజ్ అమ్మకాలు 2021లో చాలా వరకు తగ్గాయి. ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఈ కారు ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది. అయితే ఆ ప్లేసును బీఎండబ్ల్యూ ఆక్రమించింది.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా 2021 అందరికీ బ్యాడ్ ఇయర్ గానే పేరు తెచ్చుకుంది. ఈ సంవత్సరంలో కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడింది. ఇందులో భాగంగా ప్రముఖ కార్ల కంపెనీ మెర్సిడెజ్ బెంజ్ పై కూడా పడినట్లే తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఏడాదిలో మెర్సిడెజ్ బెంజ్ కార్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ఐదేళ్లుగా ఎప్పుడూ ఈ కార్లను అత్యధికులు కొనుగోలు చేయడంతో ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉండిపోయింది. కానీ 2021లో మాత్రం ఆ స్థానాన్ని కోల్పోయింది. అయితే బీఎం డబ్ల్యూ సంస్థ బెంజ్ కంటే ఎక్కువ అమ్మకాలు జరిపింది.
గతేడాదితో మెర్సిడెజ్ బెంజ్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2.05 మిలియన్ వాహనాలు విక్రయించినట్లు తెలుస్తోంది. ఇదే ఏడాదిలో బీఎం డబ్ల్యూ 2.2 మిలియన్ వాహనాలు విక్రయించి రికార్డు సొంతం చేసుకుంది. ప్రీమియం కార్లలో బెంజ్ స్థానాన్ని బీఎండబ్ల్యూ ఆక్రమించింది. ఇక ఎలక్ట్రిక్ వాహనాల్లో మాత్రం బెంజ్ ముందంజలో ఉంది. ఈ ఏడాదిలో ఈ సంస్థ 90 శాతం మేర అధికంగా అమ్మకాలు జరిపింది. ప్రపంచవ్యాప్తంగా 99,301 ఎలక్రిక్ వాహనాలను విక్రయించింది. ఇక యూరప్లో ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో పతనం చూసింది. ఇది 11.2 శాతంగా ఉంది. అమెరికాలో బెంజ్ తక్కువ వృద్ధిని సాధించినట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి.
మెర్సిడెజ్ బెంజ్ కు భారత్లోనూ క్రేజ్ ఉంది. ఈ సంస్థ నుంచి వచ్చే కొత్త మోడళ్లను సొంతం చేసుకునేందుకు కారు ప్రియులు తహతహలాడుతుంటారు. అందుకే బెంజ్ కంపెనీ భారత్ లో విరివిగా విక్రయాలు జరుపుతుంది. కానీ ఈ ఏడాదిలో భారత్ లో బెంజ్ కు క్రేజ్ తగ్గినట్లే కనిపిస్తోంది. కానీ ఇదే సమయంలో బీఎండబ్ల్యూ మాత్రం పైచేయి సాధించింది. 2021 సంవత్సరమంతా బీఎండబ్ల్యూ 8,867 కార్లను విక్రయించినట్లు తెలిపింది. టూ వీలర్ వాహనాల్లో 5,191 యూనిట్లను విక్రయించినట్లు పేర్కొంది. అంటే మొత్తంగ 35 శాతం వృద్ధిని బీఎం డబ్ల్యూ సొంతం చేసుకుంది.
కాగా ఈ ఏడాదిలో బీఎం డబ్ల్యూ 5 సిరీస్ ను మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర 62.90 లక్షలు గా నిర్ణయించారు. అయితే ఈ వాహనం ఏడు రంగుల్లో లభ్యమైంది. న్యూ ఫీచర్స్ తో ఆకట్టుకునే వాహనాలను భారత్లో ప్రవేశపెట్టి అత్యధిక సేల్స్ ను సొంతం చేసుకుంది. దీంతో బెంజ్ కంటే బీఎండబ్ల్యూ మొదటి ప్లేను సు ఆక్రమించుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.