Begin typing your search above and press return to search.
ట్రంప్ టవర్ క్రేజ్ పెరిగిపోతోంది
By: Tupaki Desk | 20 Nov 2016 9:18 AM GMTఅమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు పెరిగిపోతున్న క్రేజ్ కు ఇదో నిదర్శనం. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ట్రంప్ నివాసం - వ్యాపార సముదాయమైన ట్రంప్ టవర్ కు సందర్శకుల తాకిడి రోజు రోజుకు పెరిగిపోతుంది. స్వదేశీ - విదేశీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ టవర్ చూసేందుకు క్యూ కడుతున్నారు. ఎంతలా అంటే అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డులకు ఇక చాలు వెళ్లండి అని విసిగిపోయే స్థాయికి చేరే అంతగా.
ఈ రేంజ్ లో వస్తున్న సందర్శకులతో అక్కడున్న సెక్యురిటీ సరిపోవడం లేదట. పైగా ట్రంప్ అధ్యక్షుడి ఎన్నిక కావడంతో మరింత మంది ఈ భవనం చూసేందుకు వస్తున్నారు. దీంతో వీరికి అదనంగా తాజాగా పోలీసులు కూడా అక్కడికి పెద్ద మొత్తంలో చేరారంట. వీరందరూ భద్రత నిమిత్తం ఆంక్షలు పెడుతున్నప్పటికీ సందర్శకులు మాత్రం సెల్ఫీలు మాత్రం ఆపడం లేదంట. ఎన్నికల నిర్వహణ తేది ప్రకటించినప్పటి నుంచి ఈ తంతు మొదలైందని - ఇప్పుడు ట్రంప్ విజయం సాధించడంతో అది కాస్త మరింత ఎక్కువైందని వారు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు ట్రంప్ కు ఊహించని మద్దతు దక్కింది. అమెరికా అధ్యక్ష అభ్యర్థిని ఖరారు చేసే పార్టీ ప్రైమరీస్ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ తో పోటీ పడిన సెనేటర్ బెర్న్ శాండర్స్ ట్రంప్ కు మద్దతు ప్రకటించారు. మెక్సికోలో తయారయిన కార్లపై 35 శాతం అదనపు సుంకం వసూలు చేస్తూ ఉద్యోగ - కార్మిక వర్గాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న బడా కార్పొరేషన్ల పనిపట్టేందుకు తాను ట్రంప్ తో కలిసిపనిచేస్తానని శాండర్స్ స్పష్టం చేశారు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో కార్మికవర్గ ఓటర్ల తిరస్కరణకు గురైన డెమొక్రాట్స్ ఇప్పటికైనా మారాలని తమ పార్టీకి హితవు పలికారు. వాషింగ్టన్ లోని పార్లమెంట్ భవనం వెలుపల జరిగిన 'హీల్ అమెరికా' ర్యాలీలో ఆయన మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ వైఫల్యాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం వుందన్నారు. నిరాశ - నిస్పృహల్లో బతుకులీడుస్తున్న కార్మిక వర్గం - మధ్యతరగతి - అల్పాదాయ వర్గాలు మద్యపానానికి - మాదక ద్రవ్యాలకు బానిసలై ఆత్మహతలకు పాల్పడుతున్న విషయాన్ని ట్రంప్ గుర్తించారని బెర్నీ శాండర్స్ వివరించారు. వాస్తవాలను వాస్తవాలుగా గుర్తించాలని ఆయన తమ పార్టీ సహచరులకు హితవు పలికారు. ప్రజల్లో ఏ మాత్రం గుర్తింపు లేని వ్యక్తికి వైట్ హౌస్ ని, ప్రతినిధుల సభలో ఆధిక్యాన్ని, గవర్నర్ పదవులను కోల్పోయిన ప్రస్తుత సమయంలో డెమొక్రాటిక్ పార్టీకి కొత్త దిశానిర్దేశం అవసరమని బెర్నీ శాండర్స్ అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/