Begin typing your search above and press return to search.

అవ‌న్నీ ఉత్త‌మ పంచాయితీలేన‌ట‌.. 17 అవార్డులు ప్ర‌క‌టించిన మోడీ

By:  Tupaki Desk   |   24 April 2021 1:30 PM GMT
అవ‌న్నీ ఉత్త‌మ పంచాయితీలేన‌ట‌.. 17 అవార్డులు ప్ర‌క‌టించిన మోడీ
X
రాష్ట్రంలోని 17 గ్రామ పంచాయితీల‌కు కేంద్ర ప్ర‌భుత్వం జాతీయ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. వీటిని ప్ర‌ధా ని న‌రేంద్ర మోడీ నేడు సీఎం జ‌గ‌న్‌కు వ‌ర్చువ‌ల్ విధానంలో ప్ర‌దానం చేయ‌నున్నారు. జాతీయ పంచాయి తీరాజ్ దినోత్స‌వం సంద‌ర్భంగా వీటిని ప్రదానం చేయ‌నున్న‌ట్టు కేంద్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ ప్ర‌క‌టించారు. శ‌నివారం ప్ర‌ధాని మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ఈ అవార్డుల‌ను ప్ర‌దానం చేస్తారు.

ఇక‌, ఈ అవార్డులు ఎందుకు ఇస్తున్నారంటే..

+ శానిటేష‌న్ స్వ‌చ్ఛంగా ఉన్నందుకు‌
+ పౌర సేవ‌లు బాగా చేస్తున్నందుకు(తాగునీరు, వీధి దీపాలు, మౌలిక స‌దుపాయాలు)
+ స‌హ‌జ వ‌న‌రుల నిర్వ‌హ‌ణ బాగున్నందుకు
+ స‌మాజంలోని అట్ట‌డుగు వ‌ర్గాల‌కు సేవ‌లు చేరువ చేయ‌డం
+ సామాజిక విభాగంలో సామ‌ర్థ్యం
+ ప్ర‌కృతి విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌
+ గ్రామ పంచాయి‌తీల‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం
+ పంచాయితీల స్వ‌యం స‌మృద్ధికి పాటుప‌డ‌డం
+ ఈ-గ‌వ‌ర్నెన్స్‌లో సామ‌ర్థ్యం చూప‌డం
ఇలా.. ఇన్ని ల‌క్ష‌ణాల్లో రాష్ట్రంలోని 17 పంచాయి‌తీలు అవార్డులు అందుకుంటున్నాయి.

నిపుణుల విమ‌ర్శ‌లు ఇవే!
అయితే.. నిజంగా ప‌ట్టి చూస్తే..రాష్ట్ర వ్యాప్తంగా పంచాయితీల ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని అంటున్నారు. ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స‌హ‌కారం లేదు. పంచాయ‌తీల్లో స‌ర్పంచుల‌కు ఇప్ప‌టికీ చెక్ ప‌వ‌ర్ ఇవ్వ‌లే దు. ఎక్క‌డి ప‌నులు అక్క‌డే ఉన్నాయి. అదేవిధంగా ఈ గ‌వ‌ర్నెన్స్ కూడా ఇంకా ప్రారంభం కాలేదు. ప్ర‌కృతి విప‌త్తులు సంభ‌విస్తే.. ప‌ట్టించుకునే నాథుడు కూడా క‌నిపించ‌డం లేదు. ఇక‌, జ‌గ‌న్ ఏలుబ‌డిలో.. పంచాయితీ ఎన్నిక‌లు ఎంత ప్ర‌హ‌స‌నంగా మారాయో చెప్ప‌డం చాలా త‌క్కువే అంటున్నారు. అయినా.. రాష్ట్రానికి 17 అవార్డులు ద‌క్క‌డం గ‌మ‌నార్హం అంటున్నారు ప‌రిశీల‌కులు.