Begin typing your search above and press return to search.

‘బేటి బచావో.. బేటీ పడావో’.. ప్రచారానికే పరిమితం: పార్లమెంటలో నివేదిక

By:  Tupaki Desk   |   11 Dec 2021 8:00 AM IST
‘బేటి బచావో.. బేటీ పడావో’.. ప్రచారానికే పరిమితం: పార్లమెంటలో నివేదిక
X
ఆడపిల్లలు అన్ని రంగాల్లో సాధికారత సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బేటి బచావో.. బేటీ పడావో’ పథకం నిర్వీర్యమైపోతుంది. ఈ పథకం ప్రచారానికే పరిమితం కాగా.. చాలా రాష్ట్రాలు పట్టించుకోలేదు. కేవలం ప్రచారం కోసం మాత్రమే నిధులు ఖర్చుపెట్టాల్సి వచ్చిందని, అమలు కోసం చాలా రాష్ట్రాల్లో ప్రత్యేక చర్యలేవీ తీసుకోలేదు. ఈ మేరకు తాజాగా పార్లమెంట్లో ఈ అంశంపై చర్చ సాగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ హీనా విజయ్ కుమార్ గవిట్ అధ్యక్షతన ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది.

పదేళ్ల యూపీఏ పాలన తరువాత 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా కమలం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ‘బేటీ బచావో.. బేటీ పడావో’ పథకాన్ని 2015 జనవరి 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని పానిపట్ లో ప్రారంభించారు. స్త్రీ, పురుష లింగ భేదాన్ని తగ్గించేందుకు అన్ని రంగాల్లో మహిళలు సాధికారత సాధించాలన్నదే ఈ పథకం ఉద్దేశ్యం. అంతేకాకుండా పిల్లల లింగ నిష్పత్తిలో క్షీణతను నిరోధించడం ఈ పథకం లక్ష్యం. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తాయి.

దేశవ్యాప్తంగా మొదటి దశలో పీసీ, పీఎన్ డీటీ చట్టాన్నిఅమలు చేయడం.. అలాగే పథకంపై అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ప్రచారం కార్యక్రమంలో భాగంగా 100 జిల్లాల్లో వివిధ రంగాలకు చెందిన పనులను నిర్వహించడంలో భాగంగా వ్యక్తులకు శిక్షణ ఇవ్వడం, అట్టడుగు వర్గాల వారికి ఆర్థిక భరోసా ఇవ్వడం లాంటివి ఈ పథకం ద్వారా చేయాలని నిర్ణయించారు. ‘బేటి బచావో.. బేటీ పడావో’ పథకం ద్వారా చాలా మంది ఆడపిల్లలకు ప్రయోజనం చేకూరనుందని, దీనిని అమలు చేయకపోతే వారంతా అవకాశం చేజార్చుకున్నట్లవుతుందని తెలిపారు.

మహారాష్ట్ర బీజేపీ ఎంపీ హీనా విజయ్ కుమార్ గవిత్ నేతృత్వంలో పార్లమెంటరీ కమిటీని నియమించారు. దీతో ఈ కమిటీ గురువారం పార్లమెంట్లో నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం..‘బేటి బచావో.. బేటీ పడావో’ పథకం కోస 2019-20 బడ్జెట్లో రూ.848 కోట్లు కేటాయించారు. ఆ తరువాత 2020-21 లో కొవిడ్ కారణంగా ఎలాంటి నిధులు కేటాయించలేదు. మొత్తం నిధుల్లో రాష్ట్రాలకు రూ.622.48 కోట్లు విడుదలయ్యాయి. అయితే రాష్ట్రాలకు కేటాయించిన నిధుల్లో కేవలం 25.13 శాతం నిధులు అంటే రూ.156.46 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. 2016-2019 మధ్య కాలంలో మొదలైన మొత్తం రూ.446.72 కోట్లలో 78.91 శాతం మాత్రం పథకం ప్రచారం, ప్రకటనల కోసమే ఖర్చే చేశారని తెలిపారు.

అయితే పథకం ప్రచారం కోసం నిధులు కేటాయించినప్పటికీ రాష్ట్రాలు మాత్రం దీని గురించి పట్టించుకోలేదని తెలిపింది. అంతేకాకుండా పథకం లక్ష్యాలను సాధించడంలో రాష్ట్రాలు భాగస్వామ్యం కావాలని తెలిపింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ తక్షణమే స్పందించి రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలతో చర్చించి కమిటీ వేయాలని సూచించింది. ఆడపిల్లల సంక్షేమానికి ప్రవేశపెట్టిన ఈ పథకం ప్రయోజనాలను బాలికలకు అందేలా చూడాలని హీనా కమిటీ తెలిపింది.

కేంద్ర ప్రభుత్వ ఈ పథకాన్ని ప్రవేశపెట్టినా కొన్ని రాష్ట్రాల్లో దీని గురించి ప్రచారం కూడా చేయలేదని తెలిపారు. దీంతో అక్కడి వారికి అవగాహన కలిగించలేదన్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో పథకం గురించి హంగు, ఆర్బాలు చేసిన ప్రచారం చేసిన అమలును పట్టించుకోలేదన్నారు. ఇలాగే పోతే మరికొన్ని రోజుల్లో ఇది పూర్తిగా నిర్వీర్యమైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆయా మంత్రిత్వ శాఖలు దీని అమలు పై దృష్టి పెట్టాలన్నారు.