Begin typing your search above and press return to search.
కాయ్ రాజా కాయ్: ఈ ఎంపీ సీట్లపై బెట్టింగ్
By: Tupaki Desk | 27 March 2019 5:30 AM GMTఏపీలో బెట్టింగ్ ల జోరు మొదలైంది. ఎన్నికలకు ఇంకా కొద్దిరోజులే సమయం ఉండడంతో ఎవరు గెలుస్తారన్న చర్చ సాగుతోంది. ఏప్రిల్ 11న ఏపీలో పోలింగ్ జరుగుతుంది. మే 23న ఫలితాలు వస్తాయి. ఈ నేపథ్యంలో రేసు గుర్రాల్లాంటి నేతలు.. హాట్ సీట్లు అయిన ఎంపీ స్థానాలపై బెట్టింగ్ రాయుళ్లు కోట్లలో పందాలు కాస్తున్నారు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఏపీలో ఎలాగైతే జోరుగా బెట్టింగ్ లు కాశారో... ఇప్పుడు ఏపీలోని ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో కూడా అదే పందాలు జోరందుకున్నారు.
ఏపీలో ప్రధానంగా పలు ఎంపీ సీట్లు హాట్ హాట్ గా కనిపిస్తున్నారు. వీటిపైనే జనాల అందరిదృష్టి నెలకొంది. దీంతో బెట్టింగ్ రాయుళ్లందరూ ఈ సీట్లపైనే బెట్టింగ్ కాస్తున్నారు. ప్రధానంగా చూస్తే విశాఖపట్నం- రాజమండ్రి- నర్సాపురం- విజయవాడ- అనంతపురం సీట్లలో ఎవరు గెలుస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. వీటిపైనే కోట్ల బెట్టింగ్ లు సాగుతున్నాయి.
*వైజాగ్ ఎంపీ.. హేమాహేమీల బరి..
విశాఖ బరిలో ఈసారి ఉద్దండులు పోటీపడుతుండడంతో తీవ్ర పోటీ, ఉత్కంఠ నెలకొంది. టీడీపీ నుంచి బాలయ్య చిన్నల్లుడు భరత్ , వైసీపీ నుంచి ఎంవీవీ సత్యనారాయణ, బీజేపీ నుంచి ఫురందేశ్వరీ, ఇక జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీపడుతుండడం ఎవరు గెలుస్తారన్నది చెప్పడం కష్టంగా మారింది. ఏపీలోనే బలమైన ప్రత్యర్థులున్న ఈ పార్లమెంట్ పై కోట్ల బెట్టింగ్ లు సాగుతున్నాయి.
*రాజమండ్రి సీటు హాట్
రాజమండ్రి ఎంపీ సీటులో గత సారి పోటీచేసిన టీడీపీ అభ్యర్థి మురళీ మోహన్ ఈసారి తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఆయన కోడలు మాగంటి రూప బరిలో ఉన్నారు. ఇక వైసీపీ అభ్యర్థిగా యువకుడైన మార్గాని భరత్ బలంగా ముందుకెళ్తున్నారు. కాపు సామాజికవర్గాన్ని బేస్ చేసుకొని బలమైన ఆకుల సత్యనారాయణ జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక్కడ టఫ్ ఫైట్ నెలకొంది. బెట్టింగ్ రాయుళ్లు రాజమండ్రి జోరుగా పందాలు కాస్తున్నారు. ఖరీదైన డబ్బున్న ప్రాంతం కావడంతో ఇక్కడ పందాలు లక్షల్లో సాగుతున్నాయి.
*నర్సాపురంలో రాజుల మధ్యలో నాగబాబు
నర్సాపురంలో క్షత్రియ సామాజికవర్గమైన ‘రాజు’లకే ఈ సీటును రాజకీయ పార్టీలు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. టీడీపీ నుంచి వేటుకూరి శివరామరాజు.. వైసీపీ నుంచి రఘురామకృష్ణం రాజు పోటీచేస్తున్నారు. ఇక జనసేన నుంచి కానీ ఈసారి అనూహ్యంగా పరిస్థితి మారింది. జనసేనాని పవన్ తన అన్నయ్య నాగబాబును నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపాడు. ఇద్దరు క్షత్రియుల మధ్య, కాపు సామాజికవర్గ నాగబాబు బరిలో ఉన్నారు. అయితే మధ్యలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బరిలో ఉన్నా నామమాత్రమే.. ఈ నర్సాపురం ఫైట్ ప్రతిష్టాత్మకం కావడంతో దీనిపై జోరుగా బెట్టింగ్ జరుగుతోంది.
*రాజధాని విజయవాడ ప్రతిష్టాత్మకం
రాజధాని ప్రాంతం విజయవాడ ఎంపీ సీటు హాట్ గా మారింది. టీడీపీ నుంచి కేశినాని నాని, వైసీపీ నుంచి పీవీపీ పోటీచేస్తున్నారు. ఇద్దరూ ఆర్థికంగా బలవంతులు.. ధిట్ట నాయకులు. దీంతో ఇక్కడ గెలుపు ఎవరిదనే దానిపై జోరుగా బెట్టింగ్ లు కాస్తున్నారు..
*హిందూపురం మాధవ్ గెలుస్తాడా?
పోలీస్ అధికారిగా టీడీపీ ఎంపీ జేసీపై తొడగొట్టి మీసం తిప్పి టీడీపీకి సవాల్ చేసిన గోరంట్ల మాధవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీ తరుఫున బరిలో నిలిచాడు. అయితే ఆయన్ను పోటీచేయకుండా టీడీపీ అతడి ఉద్యోగ రాజీనామాను ఆమోదించలేదు. దీంతో చివర వరకూ ప్రయత్నించిన మాధవ్ ఆయన భార్యను బరిలో దింపేందుకు యత్నించారు. దీంతో హిందూపురంలో టీడీపీ పంతం నెగ్గుతుందా.. వైసీపీ తరుఫున నిలబడుతున్న గోరంట్ల మాధవ్ గెలుస్తాడా అన్న దానిపై జోరుగా పందాలు కాస్తున్నారు.