Begin typing your search above and press return to search.

జ‌న‌సేన మీద కూడా బెట్టింగ్స్!

By:  Tupaki Desk   |   30 April 2019 6:27 AM GMT
జ‌న‌సేన మీద కూడా బెట్టింగ్స్!
X
ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఫ‌లితాలు ఎలా ఉంటాయి? అన్న ప్ర‌శ్న‌కు జ‌గ‌న్ ప‌వ‌ర్లోకి వ‌స్తున్నార‌న్న స‌మాధానం ట‌క్కున వ‌స్తుంది. అయితే.. జ‌గ‌న్ గెలుస్తార‌న్న న‌మ్మ‌కం ఎలా ఉందో.. జ‌న‌సేన‌కు సంబంధించిన గెలుపు విష‌యాల మీద అంటే న‌మ్మ‌కంగా ఉన్నారు కొంత‌మంది. తాజాగా అలాంటి వారి పుణ్య‌మా అని.. జ‌న‌సేన మీద బెట్టింగ్స్ ఇప్పుడు కొత్త రూపుదాల్చ‌టం విశేషం.

జ‌న‌సేన ప‌వ‌ర్లోకి రాద‌న్న విష‌యం మీద క్లారిటీ ఉన్న‌ప్పుడు.. ఇక‌.. బెట్టింగ్స్ ఎలా సాధ్య‌మ‌న్న డౌట్స్ అక్క‌ర్లేదు. ఎందుకంటే.. జ‌న‌సేన మీద కాస్తున్న బెట్టింగ్స్ కాస్త భిన్న‌మైన‌వి. ఇంత‌కీ.. ప‌వ‌న్ పార్టీ మీద బెట్టింగ్స్ కాచే వారు ఎక్కువ‌గా ఎక్క‌డ ఉన్నార‌న్న విష‌యంలోకి వెళితే.. కృష్ణా.. ఉభ‌య గోదావ‌రి జిల్లాలతో పాటు.. విశాఖ జిల్లాల్లోనూ బెట్టింగ్స్ జోరుగా పెడుతున్న‌ట్లు చెబుతున్నారు.

జ‌న‌సేన ప‌వ‌ర్లోకి వ‌స్తుంద‌న్న విష‌యం మీద బెట్టింగ్స్ సాగ‌టం లేదు కానీ.. రాష్ట్రంలో ఎన్ని స్థానాల్లో జ‌న‌సేన గెలుస్తుంద‌న్న దానిపైన బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఇక‌.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం.. తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు.. కృష్ణా జిల్లా పెడ‌న‌.. అవ‌నిగ‌డ్డ.. విజ‌య‌వాడ ఈస్ట్ త‌దిత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ గెలుస్తుంద‌న్న ధీమా వ్య‌క్త‌మ‌వుతోంది.

ఎన్నిక‌లు జ‌రిగిన వేళ‌లో.. పార్టీ అధినేత ప‌వ‌న్ స్వ‌యంగా పోటీ చేసిన భీమ‌వ‌రం.. గాజువాక‌ల్లో ఒక్క స్థానంలోనే గెలుస్తార‌ని.. రెండోచోట ఓట‌మి ఖాయ‌మ‌న్న మాట వినిపించింది. పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. ప‌డిన ఓటింగ్ లెక్క‌ల్ని జాగ్ర‌త్త‌గా చూసుకున్న పార్టీ నేత‌లు.. రెండుచోట్ల ప‌వ‌న్ గెలుపు ప‌క్కా అని చెబుతున్నారు. దీంతో.. రెండు స్థానాల్లో ప‌వ‌న్ విజ‌యం సాధిస్తార‌న్న బెట్టింగ్స్ కు ఇప్పుడు ఊపందుకోవ‌టం గ‌మ‌నార్హం.

ఎన్ని సీట్లు సాధిస్తార‌న్న దాని కంటే.. గెలుపు అవ‌కాశం ఉన్న నియోజ‌కవ‌ర్గాల వారీగా బెట్టింగ్స్ చేయ‌టం ఒక ఎత్తు అయితే.. . టీడీపీ ప్ర‌భుత్వ ఏర్పాటులో జ‌న‌సేన కీల‌కంగా మారుతుంద‌న్న మాట మీదా బెట్టింగ్స్ జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. మ‌రి.. ఈ బెట్టింగ్ రాయుళ్ల‌ను ఓట‌ర్లు ఏం చేస్తారో చూడాలి.