Begin typing your search above and press return to search.

అంతుచిక్కని ఏపీ ఫలితం.. బెట్టింగ్ కష్టం

By:  Tupaki Desk   |   15 May 2019 4:10 AM GMT
అంతుచిక్కని ఏపీ ఫలితం.. బెట్టింగ్ కష్టం
X
పోలింగ్ కు.. ఫలితాలకు నడుమ ఏకంగా 45రోజుల గడువు. ఏపీ ఫలితాల కోసం ఇంత సుదీర్ఘంగా ఎప్పుడూ ఎదురుచూడలేదు.. ప్రతీ సారి ఎన్నికలు జరిగిన కొద్దిరోజులకే ఫలితాలు వచ్చేవి.దానిపై కోట్లలో బెట్టింగ్ లు జరిగేవీ. కానీ ఇప్పుడు చాలా లాంగ్ గ్యాప్ ఇవ్వడంతో బెట్టింగ్ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు..

ఫలానా పార్టీ గెలుస్తుందని మొదట బెట్టింగ్ కట్టిన వారు నెలరోజులు పూర్తయ్యేసరికి మరో పార్టీపై పందాన్ని మారుస్తున్నారట.. ఇప్పుడు ఫలితాలకు ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో బెట్టింగ్ డబ్బులను వెనక్కి తీసుకుంటున్నారట.. ఏపీ ఎన్నికలపై ఇప్పుడు బెట్టింగ్ పందాల జోరు తగ్గిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది.

సాధారణంగా బెట్టింగ్ లపై ఏపీ జనాలకు ఆసక్తి ఎక్కువ. వారి ఆసక్తి గమనించి బెట్టింగ్ జోరుగా నిర్వహిస్తారు. అయితే బెట్టింగ్ నిర్వాహకులు ఎన్నడూ లేనంత ఒత్తిడితో ఈసారి ఉన్నారు. ఎందుకంటే చాలామంది ప్రజలు - బెట్టింగ్ రాయుళ్లు ఇప్పుడు ఏపీ ఎన్నికలపై కాసిన పందాలను మొత్తం వెనక్కి తీసుకుంటున్నారు. రిస్క్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.

ఏపీ 2014 ఎన్నికలపైజోరుగా పందాలు కాశారు. ఇప్పడు 2019 ఎన్నికలపై ఎన్నికలు ముగిసిన మొదటి 10 రోజులు జోరుగా పందాలు కాశారు. ఇప్పుడు తాజాగా సర్వే రిపోర్టులు - పోలింగ్ సరళి తెలుసుకున్న బెట్టింగ్ రాయుళ్లు ప్లేట్ ఫిరాయించారు. భారీగా బెట్టింగ్ కాసిన డబ్బులను వెనక్కి తీసుకుంటున్నారు. ఇలా వెనక్కి తీసుకుంటే 10 నుంచి 20 శాతం వరకూ కమీషన్ కోల్పోవాల్సి వస్తుంది. అయినా వెనక్కి తగ్గకుండా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నారట..

దీనికి కారణం ఉందట.. ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనేది అంచనాలకు అందడం లేదట.. బెట్టింగ్ కాసిన వారు అనవసరంగా లక్షలు నష్టపోవాల్సి వస్తుందని.. ఎందుకు రిస్క్ తీసుకోవడమని ఈ నిర్ణయానికి వచ్చారట.. పోలింగ్ కు ఫలితానికి 45 రోజులు గ్యాప్ ఉండడమే బెట్టింగ్ కష్టంగా మారడానికి కారణమని నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారట.. దీంతో ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయనే టెన్షన్ నిర్వాహకులను పట్టి పీడిస్తోంది. మొత్తానికి ఈసారి అంతుచిక్కని ఏపీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ రాయుళ్లు తెగ జాగ్రత్త పడుతున్నారు.