Begin typing your search above and press return to search.

తొక్కిపడేస్తాం జాగ్రత్త.. కదం తొక్కిన కేసీఆర్

By:  Tupaki Desk   |   10 Feb 2021 2:45 PM GMT
తొక్కిపడేస్తాం జాగ్రత్త.. కదం తొక్కిన కేసీఆర్
X
సీఎం కేసీఆర్ మరోసారి కదం తొక్కారు. తొక్కి పడేస్తా జాగ్రత్త అంటూ ప్రతిపక్షాలను హెచ్చరించారు. నల్గొండ జిల్లా హాలియాలో బుధవారం జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతల తాట తీశారు. కాంగ్రెస్ నేతు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఇక బీజేపీ నేతలు 'కొత్త బిచ్చగాడు పొద్దెరగడు' అన్నట్లు మాట్లాడుతున్నారని కేసీఆర్ విమర్శించాడు. వాళ్లలా మాట్లాడాలంటే తమకు చేతకాక కాదని..తాము తలుచుకుంటే కాంగ్రెస్ మిగలదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేలు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని సూచించారు. హద్దు మీరినప్పుడు ఏం చేయాలో తమకు తెలుసన్నారు.తొక్కిపడేస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు.

తమకు ప్రజలు తీర్పునిచ్చారని.. ఢిల్లీ వాళ్లు చెబితే రాలేదని కాంగ్రెస్, బీజేపీలను కేసీఆర్ కడిగేశారు. తెలంగాణలో ఈ దుస్థితికి కారణం కాంగ్రెస్‌ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసిన పాపాత్ములు కాంగ్రెస్‌ నేతలు కాదా అన్నారు. ''తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వనని కిరణ్‌కుమార్‌ అన్నాడు.. ఆనాడు ఒక్క కాంగ్రెస్‌ నేత అయినా మాట్లాడారా? అని కేసీఆర్ నిలదీశాడు.

కమీషన్ల కోసమే ప్రాజెక్ట్‌లు కట్టామని మాట్లాడుతున్నారు.. మీరు నాగార్జునసాగర్‌ కమీషన్ల కోసమే కట్టారా? అని కేసీఆర్ నిలదీశారు. దేశంలోనే అత్యధిక వరిని పండించి ఎఫ్సీఐకి ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని.. అది తమ ఘనత అన్నారు.