Begin typing your search above and press return to search.
చెంపలేసుకొని ఏడ్చినంత పని చేసిన ఎంపీ మాన్
By: Tupaki Desk | 23 July 2016 4:24 AM GMTతాను చేసిందెంత ఎదవ పని అన్న విషయం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ తెలిసి వచ్చింది. తాను ఇంటి నుంచి బయలుదేరే సమయం దగ్గర నుంచి పార్లమెంటుకు వెళ్లే వరకూ మొత్తాన్ని వీడియో తీయటం.. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయటం.. పార్లమెంటు భద్రత విషయంలో ఒక ఎంపీ ఇష్టారాజ్యంగా వ్యవహరించటం పెద్ద దుమారాన్నే రేపింది.
పార్టీలకు అతీతంగా అందరూ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తీసుకోవటం.. ఎంపీ చర్యను తప్పు పట్టటం.. ఇందుకు అనుగుణంగానే మీడియాలోనూ వార్తలు రావటంతో.. సదరు ఎంపీకి తాను చేసిందెంత తప్పన్న విషయం అర్థమైంది. మాన్ పై చర్యలు తీసుకుంటామని స్పీకర్ సైతం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై ఎంపీని తన ఛాంబర్ వద్దకు పిలిపించుకున్న స్పీకర్.. మాన్ చర్య పట్ల తీవ్రంగా తప్పు పట్టారు. ఈ ఇష్యూ మీద ఇప్పటికే తల బొప్పికట్టిన మాన్ తన చర్య పట్ల తీవ్ర బాధను వ్యక్తం చేస్తూ.. భేషరతు క్షమాపణలు చెప్పారు. తెలియకుండా తానీ తప్పు చేశానని.. ఇది ఇంత పెద్ద విషయం అవుతుందని తాను అనుకోలేదని పేర్కొన్నారు.
ఈ ఘటన వ్యవహారం క్షమాపణలు సరిపోవని.. కమిటీ ఏర్పాటు చేస్తామని.. ఈ చర్య పట్ల అన్నిపార్టీల సభ్యులు తీవ్రంగా కలత చెందారని స్పీకర్ వ్యాఖ్యానించారు. ఈ దశలో తాను చేసిన పనికి చెంపలేసుకున్నమాన్.. కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశారని చెబుతున్నారు. తాను తీసి.. అప్ లోడ్ చేసిన 12 నిమిషాల వీడియోను తన నియోజకవర్గ ప్రజలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో పెట్టానని.. అంతకు మించిన దురుద్దేశం ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఎంత నియోజకవర్గం ప్రజలు తెలుసుకోవాలంటే మాత్రం భద్రతను గాల్లో దీపంలా మార్చేస్తూ వీడియో పెట్టాలన్న ఆలోచన రావటం ఏమిటి? ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వారు ఎంపీలుగా ఎన్నిక కావటం ఏమిటి చెప్మా..?