Begin typing your search above and press return to search.
భజ్జీ అడుగులు నటన వైపా..? రాజకీయాల్లోకా?
By: Tupaki Desk | 25 Dec 2021 12:30 PM GMTభారత క్రికెట్ లో దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ శకం ముగిసింది. మరో దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తో పోటీ పడుతూ సుదీర్ఘ కాలం టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన భజ్జీ ఎన్నో విజయాలు అందించాడు. 1998 వేసవిలో బెంగళూరులో ఆస్ట్రేలియాపై తొలి టెస్టు ఆడిన హర్భజన్.. భవిష్యత్ ఆశాకిరణంగా కనిపించాడు. అయితే, 18 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ఆడిన అతడు మధ్యలో రెండేళ్లు జట్టుకు దూరమయ్యాడు. అనూహ్యంగా 2001 ఆస్ట్రేలియా సిరీస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.
నాడు కుంబ్లే గాయపడడంతో భజ్జీ కి అవకాశం దక్కింది. హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ మరుపురాని 281 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన చారిత్రాత్మక కోల్ కతా టెస్టులోనే భజ్జీ క్రికెట్ కెరీర్ మలుపుతిరిగింది. ఈ టెస్టులోనే హ్యాట్రిక్ సహా భజ్జీ 13 వికెట్లు పడగొట్టి టీమిండియా గెలుపులో కీలకంగా నిలిచాడు.
పదేళ్లు తిరుగులేదు.. ఐదేళ్లు ఒడిదొడుకులు భజ్జీ కెరీర్ ను విశ్లేషిస్తే తొలి మూడేళ్లు సాధారణ ఆటగాడిగా... తర్వాతి పదేళ్లు టాప్ క్లాస్ స్పిన్నర్ గా.. మరో ఐదేళ్లు ఒడిదొడుకులతో సాగింది. పంజాబ్ లోని జలంధర్ నగరం ఇరుకు వీధుల నుంచి మొదలైన అతడి క్రికెట్ ప్రస్థానం లండన్ లార్డ్స్ మైదానం వరకు విజయవంతంగా సాగింది. చివరకు.. జీవితంలో అన్ని ఇచ్చిన క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది అంటూ శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.
భారత జెర్సీతో వీడ్కోలు మ్యాచ్ ఆడాలని భావించినా.. చివరకు ఆ కోరిక నెరవేరకుండానే తప్పుకొన్నాడు. వాస్తవానికి 2010లో అశ్విన్ రావడంతోనే భజ్జీకి పోటీ మొదలైంది. అశ్విన్ కూడా ఆఫ్ స్పిన్నర్ కావడం పోటీని మరింత పెంచింది. అప్పటికే భజ్జీ వెనుకంజలో ఉండడం దెబ్బకొట్టింది. అప్పటికీ ఐదారేళ్లు నెట్టుకొచ్చినా.. 2016 సీజన్ తోనే హర్భజన్కెరీర్ ముగిసింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఏమో మానసికంగా చాలాకాలం క్రితమే రిటైర్ అయ్యా అని భజ్జీ ప్రకటనలో పేర్కొన్నాడు.
ఇప్పుడెటు...? క్రికెట్ కెరీర్ చరమాంకానికి వచ్చిందని భావించిన భజ్జీ కొన్నాళ్లుగా బాలీవుడ్ పై చూపుపెట్టాడు. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ నటన పట్ల ఆసక్తి చూపాడు. నటనను సీరియస్ గా తీసుకోనున్నట్లు చెప్పాడు. ఓటీటీ కంటెంట్ నిర్మాణంపైనా ప్రణాళికలు ఉన్నాయని అన్నాడు.ఇప్పటికే అతడు తమిళ సినిమాలోనూ నటించాడు. క్రికెటర్ గా ఎలాగూ లైమ్ లైట్ లో లేడు కాబట్టి..ఇకపై పూర్తి సమయం నటనపై వెచ్చిస్తాడా? అని చాలామంది భావించారు.
మారిన పరిస్థితులు.. రాజకీయాల వైపు అడుగులు ఇప్పుడు పరిస్థితులు మారాయి. దీనికితోడు వచ్చే రెండు నెలల్లో ఎన్నికలు జరుగనున్నభజ్జీ సొంత రాష్ట్రం పంజాబ్ రాజకీయాలు మరింత మారాయి. సీఎంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత అమరీందర్ సింగ్ మార్పు.. ఆయన బయటకు వెళ్లిపోవడం.. దళితుడైన చరణజీత్ సింగ్ చన్నీని సీఎం చేయడం.. మరోవైపు మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పీసీసీ అధ్యక్షుడు కావడం చకచకా జరిగిపోయాయి. అయితే, ఆ పార్టీలో పెద్ద సంక్షోభమే నడుస్తోంది. సిద్ధూ పాకిస్థాన్ ప్రధానిని ఇమ్రాన్ ఖాన్ ను పొగుడుతుండడం మరింత ఇబ్బంది కలిగిస్తోంది.
ఇక భజ్జీ విషయానికి వస్తే పంజాబ్ రాజకీయాల్లోకి అడుగు పెడతారా అన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఇటీవల అతడు సిద్దూను కలిశాడు.మిగతా పార్టీల వారితోనూ టచ్ లో ఉంటున్నాడు. అయితే, అతడు సహజంగానే కలిశాడా? రాజకీయ ఉద్దేశాలతో కలిశాడా? అనేది తెలియరాలేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?