Begin typing your search above and press return to search.
చంద్రుల్ల రాజకీయ కలపై నీళ్లు చల్లేశారే
By: Tupaki Desk | 9 Sep 2017 4:45 AM GMTపరిపాలనలో తమదైన ప్రత్యేకతలు - రాజకీయంగా ఎన్నో విబేధాలను కలిగి ఉన్నప్పటికీ తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులైన ఇద్దరు చంద్రుల మధ్య ఒక సారుప్యత ఉంది. అదే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ. ఏపీ సీఎం నారాచంద్రబాబు నాయుడు - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు కూడా తమ తమ రాజకీయపార్టీలను బలోపేతం చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారనేది కాదనలేని నిజం. ఇందులో ప్రధానంగా వారు ఇతర పార్టీల రాజకీయవేత్తలకు గేలం వేస్తున్నారు. తమ పార్టీలోకి వస్తే భవిష్యత్ ఉంటుందని పేర్కొంటూ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే వారు కోరుకుంటున్న చోట బరిలో దిగవచ్చని చెప్తున్నారు.
ఇలా ఊరిస్తూనే ఇద్దరు సీఎంలు ఇతర పార్టీలకు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు - పార్టీ నేతలను తమ గూటికి చేర్చుకున్నారని రాజకీయ వర్గాలు చెప్తుంటాయి. ఒకడుగు ముందుకు పది అడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతున్న ఈ పునర్ విభజన ప్రక్రియకు తాజాగా ఫుల్ స్టాప్ పడినట్లుంది. భారతదేశంలో రానున్న దశాబ్దకాలంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం లేదని ఉభయ తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తేల్చిచెప్పారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అవసరమైతే చట్టసవరణ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలేశుని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం ఉప ఎన్నికలు ఎక్కడా పెండింగ్ లో లేవని - 2019 జనరల్ ఎన్నికల కోసం వేచి చూడాల్సిందేనని భన్వర్ లాల్ అన్నారు. ఇప్పటి వరకూ జాబితాలో నకిలీ ఓటర్లు లేరని, ఇక ముందు అటువంటి వాటికి తావివ్వబోమని విలేఖర్లు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2019లో జరిగే ఎన్నికలకు ముందు ఇంటింటికీ వెళ్లి జాబితాలను తమ సిబ్బంది మరోసారి పరిశీలిస్తారని తెలిపారు. 2018 - జనవరి 1కి సంబంధించి కొత్త ఓటర్ల జాబితా తయారీ నవంబర్ 1నుంచి ప్రారంభం కానుందన్నారు. ఆ రోజుకు 18 ఏళ్లు నిండే వారంతా ఓటరుగా నమోదు కావచ్చునన్నారు. ప్రతి జిల్లాలో రాజకీయ నేతలతో సమావేశాలు ఏర్పాటుచేసి, పోలింగ్ స్టేషన్లు తదితర అంశాలపై చర్చించి, తదనుగుణంగా జాబితా తయారుచేస్తామని భన్వర్‌లాల్ తెలిపారు.