Begin typing your search above and press return to search.

ఇన్ యాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటే ఏమిటి? అదెలా పని చేస్తుంది?

By:  Tupaki Desk   |   3 Jan 2021 6:30 AM GMT
ఇన్ యాక్టివేటెడ్ వ్యాక్సిన్ అంటే ఏమిటి? అదెలా పని చేస్తుంది?
X
హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగానికి అనుమతులు లభించటం తెలిసిందే. మరో దశ అనుమతులు వచ్చేస్తే వినియోగించేయొచ్చు. మరో వారంలో ఆ అనుమతులు కూడా రానున్నాయి. ఇదిలా ఉంటే.. కొవాగ్జిన్ ఇన్ యాక్టివేటెడ్ వ్యాక్సిన్ రకానికి చెందినదిగా చెబుతున్నారు.

ఈ వ్యాక్సిన్ లో పూర్తిగా నిర్జీవంగా మార్చిన వైరస్ కు సంబంధించిన అణువులు ఉంటాయి. దీంతో సజీవ వైరస్ లా ఇన్ఫెక్షన్ కలిగించే శక్తి సామర్థ్యాలు ఉండవు. వ్యాక్సిన్ డోస్ ఎప్పుడైతే శరీరంలోకి ప్రవేశిస్తుందో.. ఆ వెంటనే రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందిస్తుంది. అది సజీవ వైరస్సేనని భావించి.. దానిపై దాడి కోసం యాంటీబాడీల్ని విడుదల చేస్తుంది. దీంతో.. వైరస్ ను ఎదుర్కోవటానికి అవసరమైన శక్తి సొంతమవుతుంది.

మనం రెగ్యులర్ గా వినియోగించే పోలియో.. రేబిస్.. హెపటైటీస్ ఏ తరహా టీకాలన్ని కూడా ఇన్ యాక్టివేటెడ్ రకం వ్యక్సిన్లే. ఇవి ఎలా పని చేస్తాయో.. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ కూడా అదే తరహాలో పని చేస్తుందని చెయనుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. జనవరి పది లోపే ఈ వ్యాక్సిన్ వినియోగం మొదలయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.