Begin typing your search above and press return to search.
కరోనాకు యాంటీబాడీస్ చికిత్స..భారత్ బయోటెక్ విజయం
By: Tupaki Desk | 9 May 2020 8:30 AM GMTప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్ ను అరికట్టడానికి అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ విస్తృత పరిశోధనలు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి. వ్యాక్సిన్ రావడానికి మరో ఏడాది పడుతుందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే భారత్ లోని హైదరాబాద్ కు చెందిన ‘భారత్ బయోటెక్’ ఫార్మా కంపెనీ అద్భుతం చేసింది. ‘హ్యుమన్-మోనో క్లోనల్ యాంటీబాడీస్’ చికిత్సను అభివృద్ధి చేసింది. భారత్ బయోటెక్ ప్రాజెక్టుకు సీఎస్ఐఆర్ అనుమతి మంజూరు చేసింది.
భారత్ బయోటెక్ చేపట్టిన ప్రాజెక్టులో పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్, ఐఐటీ-ఇండోర్, గురుగ్రామ్ కు చెందిన ప్రిడోమిక్స్ టెక్నాలజీస్ భాగస్వాములుగా పనిచేస్తున్నాయి.
కరోనాకు ఔషధాలు, వ్యాక్సిన్ లేని సమయంలో ప్రత్మామ్మాయ చికిత్స విధానాలు అవసరమని.. అందుకే తాము తయారు చేశామని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ చికిత్సతో కరోనా వైరస్ ను నిర్వీర్యం చేయడంతోపాటు వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడంలో ఈ తరహా చికిత్స సత్ఫలితాలు ఇస్తుందని సంస్థ పేర్కొంది. వ్యాధి బారిన పడ్డ వారికి ఈ చికిత్స సరైన పరిష్కారం అవుతుందని సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల తెలిపారు.
కరోనాను నాశనం చేసే ఈ యాంటీ బాడీల మిశ్రమాన్ని ఆవిష్కరించే పనిలో ఉన్నామని భారత్ బయోటెక్ తెలిపింది. రాబోయే 6నెలల్లో ఈ చికిత్స అందుబాటులోకి తెస్తామన్నారు. ఇదే కరోనాకు తొలి చికిత్స అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక ఇదే భారత్ బయోటికె అమెరికాలోని మాడిసన్ లో గల విస్కాన్ యూనివర్సిటీ పరిశోధకులతో కలిసి కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తోంది.