Begin typing your search above and press return to search.
ఆ ఫత్వాపై ‘మహా’ సీఎం ఫైర్
By: Tupaki Desk | 3 April 2016 9:22 AM GMTభారత్ మాతాకీ జై అన్న నినాదం చేయాల్సిన అవసరం లేదని.. దాన్ని వ్యతిరేకించాలంటూ యూపీలోని దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ వర్సిటీ ఇటీవల ఫత్వా జారీ చేయటం తెలిసిందే. ఈ ఫత్వా జారీ అయిన నేపథ్యంలోనే ఇదే అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఫైర్ అయ్యారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. భారత్ మాతాకీ జై అనని వాళ్లకు దేశంలో బతికే హక్కు లేదని వ్యాఖ్యానించారు. భారత్ మాతాకీ జై అనని వారు.. పాకిస్థాన్ కీ జై.. చైనా కీ జై అని నినాదాలు చేస్తారా? అని ప్రశ్నించారు.
దేశంలో బతకాలనుకుంటే భారత్ మాతాకీ జై అనే నినాదాన్ని అనాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో ‘భారత్ మాతాకీ జై’ నినాదం వివాదాస్పదంగా మారింది. ఫడ్నవీస్ తన ప్రసంగంలో ముంబయిలోని మజార్ ప్రాంతానికి వెళ్లి చూడాలని.. అక్కడున్న ముస్లిం మత పెద్దలు సైతం భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తారని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసీ తీవ్రంగా ఖండించారు. దేశంలో ఎవరు ఉండాలో.. ఎవరు ఉండకూడదో నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వారు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించి చేయాలన్నారు. దేశాన్ని ప్రేమించని వారు దేశంలో బతకాల్సిన అవసరం ఏముందన్న కోణంలో ఫడ్నవీస్ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. ఆయన వ్యాఖ్యలకు మతం రంగు అద్దే కన్నా.. దేశాన్ని ప్రేమించే వారు.. ప్రేమించని వారన్న కోణంలో చూస్తే సరిపోతుంది కదా..?
మరోవైపు.. ఫడ్నవీస్ కు సుద్దులు చెబుతున్న ఇల్యాసీనే చూస్తే.. ఫడ్నవీస్ మాటల్ని తప్పు పడుతున్న ఆయన.. భారత్ మాతాకీ జై అనే నినాదంపై రచ్చ చేస్తున్న వారిని ఎందుకు తప్పు పట్టం లేదు? దాన్నో పెద్ద ఇష్యూలా మార్చేసి ఫత్వా జారీ చేయటం ఎందుకని ప్రశ్నించటం లేదు? ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదని..కీలక స్థానాల్లో ఉన్న వారు బాధ్యతగా వ్యవహరించాలని చెబుతున్న ఆయన.. ఓవైసీ.. దేవ్ బంద్ వర్సిటీ లాంటి వాళ్లకు ఇలాంటి హితవునే చెప్పరెందుకు..?