Begin typing your search above and press return to search.
ఎవరీ భూపేన్ హజారికా?
By: Tupaki Desk | 26 Jan 2019 5:30 PM GMTఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఎన్డీయే సర్కారు పౌర పురస్కారాల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ కోసం ఒకరికి ముగ్గురిని ఎంపిక చేసింది. ప్రతి ఎంపికలోనూ ఒక వ్యూహం ఉంది. ఈ పురస్కారానికి ఎంపికైన వారిలో భూపేన్ హజారికా గురించి జనాలకు తెలిసింది తక్కువే. ఈశాన్య రాష్ట్రమైన అసోం నుంచి ఆయన రావడమే అందుక్కారణం. ఐతే హజారికా తక్కువ వాడేమీ కాదు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. భూపేన్ 2011లోనే చనిపోయారు. ఆయన మరణించిన ఎనిమిదేళ్లకు కేంద్ర ప్రభుత్వం భారత రత్నకు ఎంపిక చేసింది. ఇంతకీ ఈయన నేపథ్యమేంటో చూద్దాం పదండి.
భూపేన్ హజారికా బహుముఖ ప్రజ్నాశాలి. ఆయన ఎన్నో రంగాల్లో ప్రావీణ్యం సంపాదించారు. కవిగా.. గాయకుడిగా.. సంగీత దర్శకుడిగా.. నటుడిగా.. జర్నలిస్టుగా.. రచయితగా.. ఫిలిం మేకర్ గా గుర్తింపు సాధించారు. 1926లో అస్సోం రాష్ట్రంలోని తిన్సుకియా జిల్లాలోని సాదియా అనే చిన్న పట్టణంలో భూపేన్ జన్మించారు. ఆయన కుటుంబంలో అందరూ ఉపాధ్యాయులే కావడం విశేషం. గౌహతిలో తన ప్రాథమిక విద్య అభ్యసించిన భూపేన్ ఆ తర్వాత వారణాసికి వెళ్లి బనారస్ హిందూ యూనివర్శిటీలో ఉన్నత విద్య పూర్తి చేశారు. కొలంబియా యూనివర్శిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్స్‌లో పీహెచ్‌డీ చేశారు.
అమెరికాలో ఉన్న సమయంలో ప్రముఖ అమెరికా గాయకుడు పాల్ రాబ్సన్ తో హజారికాకు పరిచయం ఏర్పడింది. పాల్ పాడిన ‘ఓల్డ్ మ్యాన్ రివర్’ అనే పాటను హిందీలో ‘ఓ గంగా బెహెతీ హో’గా ఆలపించారు హజారికా. ఈ పాట నాటి కమ్యూనిస్టు నేతల నుంచి నేటి కమ్యూనిస్టు నేతలు కూడా పాడుతుంటారు. గిరిజనుల సంగీతం అంటే భూపేన్‌కు ప్రాణం. 1939లో అస్సామీ సినిమా ‘ఇంద్రమాలతి’ కోసం తొలిసారిగా పాట పాడారు భూపేన్. దీంతో పాటు హిందీ.. బెంగాలీ సినిమాలు చాలా వాటికి టలు రాసి తనే కంపోజ్ చేశారు.
‘చమేలీ మేమ్ సాబ్’ చిత్రానికి గాను 1976లో ఆయన ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకోవడం విశేషం. తర్వాత 1960లో ‘శంకుతల’.. 1964లో ‘ప్రతిధ్వని’.. 1967లో ‘లోటీగోటీ’ సినిమాలకూ జాతీయ అవార్డులు సాధించారు. 1967 నుంచి 1972 వరకు ఎమ్మెల్యేగా కూడా సేవలందించిన భూపేన్.. 004లో బీజేపీ టికెట్‌పై గౌహతి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1977లో పద్మశ్రీ అవార్డు.. 1987లో సంగీత్ నాటక్ అకాడెమీ అవార్డులు అందుకున్నారు. 1999 నుంచి 2004 వరకు సంగీత్ నాటక్ అకాడెమీకి ఛైర్మెన్ గా కూడా వ్యవహరించారు. 2011లో 85 ఏళ్ల వయస్సులో భూపేన్ హజారికా మరణించారు.