Begin typing your search above and press return to search.
మోదీ సంచలనం!..ప్రణబ్ కు భారత రత్న!
By: Tupaki Desk | 25 Jan 2019 5:00 PM GMTకేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. రాజకీయాలకు ఎంతమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా దేశ పురోభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించారంటూ ఏకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ మోస్ట్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రకటించింది. ఈ మేరకు కాసేపటి క్రితం మోదీ సర్కారు సంచలన ప్రకటన చేసింది. యూపీఏ అధికారం చేపట్టాక ఏకంగా ప్రధాన మంత్రి పదవి వరిస్తుందని అంతా భావించినా... రాజకీయాల్లో ఆరితేరిన ప్రణబ్‌కు మొండి చెయ్యే లభించింది. అనూహ్యంగా మన్మోహన్ సింగ్ ను తెర మీదకు తెచ్చిన సోనియా గాంధీ... మన్మోహన్ కేబినెట్ లో ప్రణబ్ కు కీలక మంత్రి పదవిని ఇచ్చింది. ఆ తర్వాత మరోమారు మంత్రి పదవికి కాకుండా ఏకంగా ప్రణబ్ కు రాష్ట్రపతి పదవిని ఇచ్చేసింది. యూపీఏ-2 కాలంలో రాష్ట్రపతి భవన్‌కు మారిన ప్రణబ్... తనదైన శైలిలో ఆ పదవికి వన్నె తెచ్చారనే చెప్పాలి.
ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టింది ప్రణబ్ హయాంలోనే. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రణబ్ రాష్ట్రపతిగా, ఆ పార్టీని చిత్తు చేసిన నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటే... దేశ ప్రగతి రథ చక్రాలు సవ్యంగానే సాగుతాయా? అన్న వాదనను చెరిపేసిన వీరిద్దరూ... బాగానే కలిసిపోయారు. మేకిన్ ఇండియా అంటూ మోదీ ప్రవేశపెట్టిన కొత్త పథకానికి రాష్ట్రపతిగా ప్రణబ్ కూడా ఊపిరులూదారని చెప్పక తప్పదు. మొత్తంగా మోదీ హయాంలోనూ రాష్ట్రపతిగా ప్రణబ్ తనదైన శైలిలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా రాకుండా తన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చారు. అయితే మరో దఫా ప్రణబ్ కు రాష్ట్రపతిగా అవకాశం లభిస్తుంది... అందుకు మోదీ కూడా సిద్ధంగానే ఉన్నారు... అంటూ ప్రచారం జరిగినా... ప్రణబ్ కు ఆ అవకాశం ఇవ్వని మోదీ... రామ్ నాథ్ కోవింద్ ను తదుపరి రాష్ట్రపతిగా ఎంపిక చేశారు. ఎప్పుడైతే రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టారో.. ప్రణబ్ కూడా రాజకీయాలకు సెలవు చీటి ఇచ్చేసినట్టుగానే వ్యవహరించారు.
రాష్ట్రపతి హోదాలో ఉన్నంత వరకూ ఎలాంటి రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు కదా. కనీసం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు కూడా అనుకూలంగా వ్యవహరించారన్న మచ్చ కూడా తనపై పడకుండా చాలా జాగ్రత్తగా, హుందాగా వ్యవహరించారు. అయితే ఆది నుంచి కాంగ్రెస్ పార్టీ నేతగా కొనసాగిన ప్రణబ్... రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయాక... ఆరెస్సెస్ సమావేశాలకు వెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ క్రమంలోనే కలమనాథుల్లోనూ ప్రణబ్ కు ఓ సానుకూల దృక్పథం ఏర్పడిందని చెప్పాలి. తాజాగా ఏకంగా ప్రణబ్ ను భారతరత్నకు ఎంపిక చేసిన మోదీ సర్కారు నిజంగానే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ప్రణబ్ తో పాటుగా జన సంఘ్ భావాలతో తమకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న నానాజీ దేశ్ ముఖ్, కమ్యూనిస్ట్ కవిగానే కాకుండా మానవతావాదిగా, ఒడిశా వాగ్గేయకారుడిగా తనకంటూ ప్రత్యేక ముద్రను సంపాదించుకున్న భూపేన్ హజారికాకు కూడా భారత రత్న అవార్డులను ప్రకటిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.