Begin typing your search above and press return to search.
భరత్ కారు స్పీడో మీటర్ అక్కడ ఆగిందట
By: Tupaki Desk | 25 Jun 2017 9:40 AM GMTమితిమీరిన వేగం ప్రాణాల్ని తీస్తుందన్నది చాలా చాలా బేసిక్ విషయం. కానీ.. ఇదే విషయాన్ని పట్టించుకోని వైనం విలువైన ప్రాణాల్ని కోల్పోయేలా చేయటమే కాదు.. కుటుంబ సభ్యుల్ని.. నమ్ముకున్న వారిని తీవ్ర శోకంలోకి నెట్టేసేలా చేస్తోంది. అమితమైన వేగంతో వాహనాలు నడిపి.. ప్రాణాలు పోగొట్టుకున్న ప్రముఖుల సంఖ్య తక్కువేం కాదు.
ఒక ఉదంతం జరిగిన తర్వాత అయినా మేలుకోవాల్సి ఉన్నా.. అలాంటిదేమీ లేదన్న విషయం తాజాగా జరిగిన ప్రమాదం మరోసారి స్పష్టం చేసింది. వాయు వేగంతో దూసుకెళ్లిన కారుతో ప్రాణాలు కోల్పోయారు ప్రముఖ హీరో రవితేజ సోదరుడు.. నటుడు భరత్. శంషాబాద్ నుంచి గచ్చిబౌలికి వెళుతున్న ఆయన తన స్కోడా కారు ప్రమాద సమయంలో 140 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్లినట్లుగా గుర్తించారు. కారు ముందు భాగమంతా నుజ్జునుజ్జు కావటం.. స్పీడో మీటర్ 140 వద్ద ఆగిపోవటం చూస్తే.. ప్రమాద సమయంలో భరత్ ఎంత వేగంగా కారు నడుపుతున్నారన్న విషయం అర్థమవుతుందని చెబుతున్నారు.
ఆ మధ్య మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మరణం కూడా అమితమైన వేగంతో కారు నడపటం వల్లే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. బలమైన మెట్రో ఫిల్లర్ ను అమితమైన వేగంతో ఢీ కొనడంతో నిషిత్ ప్రాణాలు పోగొట్టుకుంటే.. తాజా ఉదంతంలో ఫుల్ లోడ్ లో ఉన్న లారీని ఢీ కొట్టటంతో భరత్ ప్రాణాలు ఘటనాస్థలంలోనే పోయినట్లుగా చెబుతున్నారు. వాహనం ఎంత ఖరీదైనదన్నా.. ప్రమాద తీవ్రత పెరిగేకొద్దీ ఎంతటి భద్రమైన కారు కూడా కాపాడలేదన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/