Begin typing your search above and press return to search.
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
By: Tupaki Desk | 9 Nov 2018 12:15 PM GMTఅమెరికాలో మరో తెలుగు విద్యార్థి ఆకస్మిక మరణం పొందారు. మిన్నెయాపోలిస్ నగరంలో భార్గవ్ రెడ్డి ఇత్తిరెడ్డి (25) అనే తెలుగు విద్యార్థి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. గుండెపోటు రావడంతో తోటి స్నేహితులు దగ్గరలోని మెడికల్ సెంటర్ కు తరలించారు. కానీ మార్గమధ్యంలోనే మరణించాడు.
ఇత్తిరెడ్డి భార్గవ్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని కరీంనగర్ జిల్లా. నార్త్ టెక్సాస్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ఉద్యోగం కోసం టెక్సాస్ నుంచి మిన్నెయా పోలీస్ నగరానికి ఇటీవలే వచ్చాడు.
భార్గవ్ రెడ్డి చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం తోటి స్నేహితుల్లో విషాధం నింపింది. ఇతరులకు సహాయపడే భార్గవ్ మృతిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. భార్గవ్ మృతదేహాన్ని కరీంనగర్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.