Begin typing your search above and press return to search.

లక్ష ఇళ్లు అన్నారు.. తోక ముడిచారు: భట్టి

By:  Tupaki Desk   |   19 Sep 2020 3:00 PM GMT
లక్ష ఇళ్లు అన్నారు.. తోక ముడిచారు: భట్టి
X
రెండు మూడు రోజులుగా కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య ‘డబుల్ బెడ్ రూం’ ఇళ్ల పంచాయితీ తెగడం లేదు. మొదట అసెంబ్లీలో కేసీఆర్ కట్టిస్తానన్న ‘లక్ష డబుల్ బెడ్ రూం’లు ఏవీ అని కాంగ్రెస్ నేత భట్టి ప్రశ్నించారు. దానికి మంత్రి తలసాని తెగ ఫీల్ అయిపోయి భట్టిని వెంటపెట్టుకొని హైదరాబాద్ చుట్టుపక్కల కేసీఆర్ సర్కార్ నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను చూపించారు.

అయితే అన్నీ పరిశీలించాక కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క్ టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ‘లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు చూపించలేక రాష్ట్ర ప్రభుత్వం తోకముడిచిందని’ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ ది ‘డబుల్ మాయ’ అని ఎండగట్టారు. తమకు లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు చూపిస్తామని చెప్పి రెండు రోజులు తిప్పి మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారని ఆరోపించారు.

తమకు రెండు రోజుల్లో కేవలం 3428 ఇళ్లు మాత్రమే చూపించారని భట్టి తెలిపారు. అసెంబ్లీలో చాలెంజ్ చేస్తే తమను తీసుకెళ్లి వాళ్లు చూపించిన లెక్క 3428 మాత్రమేనని మండిపడ్డారు.

లక్షల ఇళ్లు కట్టి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రజలను మభ్య పెడుతున్నారని విమర్శించారు.ప్రతిసారి ఎన్నికల సమయంలో శాసనసభలో తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు.

ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 4వేల ఇళ్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు కొన్ని చోట్ల పనులే ప్రారంభించలేదని భట్టి విమర్శించారు. హైదరాబాద్ నగర ప్రజలను మోసం చేస్తున్నామని భట్టి మండిపడ్డారు.