Begin typing your search above and press return to search.
కేసీఆర్.. ఓ బఫూన్.. అంత మాట అనేసింది ఎవరంటే?
By: Tupaki Desk | 7 May 2020 3:45 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించటం అంత మామూలు విషయం కాదు. ప్రజల్లో నమ్మకంతో పాటు విశ్వాసం ఉన్న నాయకుడిగానే కాదు.. ఎన్నికలు ఏదైనా విజయాన్ని కట్టబెట్టేస్తున్న వైనంతో ఆయన తీరు ఎలా మారిందో తెలిసిందే. ఎవరైనా సరే తనను పొగడాలే తప్ప.. తప్పు ఎత్తి చూపించకూడదన్నట్లుగా మారింది. అలాంటి ప్రయత్నం చేస్తే.. ముందు వెనుకా చూడకుండా వాయించేస్తున్న ధోరణి ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. ప్రతిపక్ష నేతలు మొదలు ఎవరైనా సరే.. తనను ఒక మాట అంటే.. అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న సందేశాన్ని కేసీఆర్ ప్రెస్ మీట్లో తరచూ చెప్పేస్తుంటారు.
తాజాగా ఆయన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీని.. నేతల్ని బండకేసి బాదేసినట్లుగా తిట్ల వర్షం కురిపించటం తెలిసిందే. చౌకబారు రాజకీయాలు చేస్తున్నారంటూ తిట్టిపోయటమే కాదు.. ఇదేం దరిద్రం అంటూ ఫైర్ అయ్యారు. తమను అన్నేసి మాటలు అన్నాక కాంగ్రెస్ నేతలు మాత్రం ఊరుకుంటారా? అందునా మల్లు భట్టి విక్రమార్క లాంటి వారికి కేసీఆర్ మాటలు ఎక్కడో మండేలా చేశాయి. తమను అన్నేసి మాటలు అన్న కేసీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్.. ఓ బఫూన్ లా వ్యవహరిస్తున్నారని.. ప్రతిపక్షాల సూచనలు పట్టించుకోకుండా తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వ తీరును తప్పు పడుతూ రైతులు ధాన్యాన్ని తగలబెడితే.. ఆ విషయాన్ని ప్రశ్నించారన్న అక్కసుతో తమపై విమర్శలు చేస్తున్నారన్నారు.
చీప్ లిక్కర్ ధరను పెంచి.. చీప్ ముఖ్యమంత్రిగా మారారన్న ఆయన.. మద్యం ధరలు పెంచినందుకు కేసీఆర్ మీద పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని ఎంపీ రేవంత్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ పిట్టల దొరలా కథలు చెప్పారంటూ మరో సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.