Begin typing your search above and press return to search.
ఆర్టీసీ తర్వాత కేసీఆర్ టార్గెట్ ఏంటో తెలుసా?
By: Tupaki Desk | 3 Nov 2019 6:30 PM GMTగత నెల రోజులుగా...ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండటం...అన్ని రాజకీయ పక్షాలు కార్మికులకే మద్దతు ఇస్తున్నప్పటికీ..వారికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డెడ్ లైన్ ఇచ్చి...ఉద్యోగాల్లో చేరుతారా లేదా తేల్చుకోవాలని స్పష్టం చేయడం...చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. కేసీఆర్ గతంలో చెప్పిన హామీలనే కార్మికులు నేడు నెరవేర్చాలని కోరుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ మాటలను చూస్తుంటే రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినట్లు ఉందని భట్టి అన్నారు. ఆర్టీసీ అనేది ప్రజలకు సేవ చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థ అని అన్నారు. ఆర్టీసీ పై ఏ నిర్ణయం అయినా చట్ట సభల్లో చర్చలు జరపాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫ్యూడలిస్టు భావాలతో పని చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఆయన సొంత ఎస్టేట్ కాదని చెప్పారు. మీడియా సమావేశంలో ప్రతినిధులపై విరుచుకుపడటం సరికాదన్నారు. ప్రజల తరఫున ప్రశ్నిస్తే బెదిరిస్తారా అని నిలదీశారు.
ఆర్టీసీ ఒకరోజుతో నిర్మించింది కాదని, దశాబ్దాల కష్టంతో వచ్చిన ఆస్తి అని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజల ఆస్తులు - ప్రజల రూట్లు ప్రైవేటికరణ చేసేందుకు కేసీఆర్ ఎవరు అని భట్టి ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేసే రూట్లను ప్రైవేటీకరణ చేయడం అంటే అమ్మడం అన్నట్లేనని మండిపడ్డారు. రాష్ట్రంలో అతిపెద్ద కార్పొరేషన్ ఆర్టీసీ సర్కారు తీరుతోనే ఆరేళ్లలో దివాలా తీసిందని అన్నారు. అప్పుల పేరుతో...ఇవాళ ఆర్టీసీ - రేపు సింగరేణి.. ఇలా ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టేలా ఉన్నారని మండిపడ్డారు. కార్మికుల మరణాలకు ప్రతిపక్షాలు కారణం కాదని - ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని - ధైర్యంగా ఉండాలని భట్టి విక్రమార్క సూచించారు. కనీసం ఇప్పటికైనా కార్మికులను చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు.
మంచి పాలన ఇవ్వాలని కేసీఆర్ కి ప్రజలు అధికారం ఇస్తే, దాన్ని ఆయన దుర్వినియోగం చేసుకుంటున్నారని మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేస్తానన్న సీఎం కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చేశారని అన్నారు. పాలన చేయలేక రాష్ట్రాన్ని దివాలా తీయించి, ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే మూడు లక్షల కోట్లు అప్పులు చేసిన సీఎం మరో మూడు లక్షల కోట్లు అప్పులు చేసేలా ఉన్నారని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మండిపడ్డారు. ఆర్టీసీ కేవలం ఆ సంస్థ యొక్క ఒక్క కార్మికుల సమస్య కాదని.. ప్రజలు ఆలోచన చేయాలని కోరారు.