Begin typing your search above and press return to search.
భట్టి వర్సెస్ కేటీఆర్.. వేడెక్కిన టీ అసెంబ్లీ
By: Tupaki Desk | 21 Sep 2019 12:21 PM GMTప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న కాలానికి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలోనే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా ప్రభుత్వంపై కాంగ్రెస్ తరఫున భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నా రు. తాజాగా శనివారం నాటి సభలో .. ఉద్యోగాలకు సంబంధించిన చర్చ జోరుగా సాగింది. ముఖ్యంగా విభజన సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఐటీఐఆర్ ను మంజూరు చేసింది. దీనికింద దాదాపు 70 లక్షల ఉద్యోగాలు వస్తాయని - అయితే - కేసీఆర్ ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టడం లేదని - అందుకే ఇది కొరగాకుండా పోయిందని విరుచుకుపడ్డారు.
దీనికి ప్రతిగా సభలోనే ఉన్న ఐటీ మంత్రి కేటీఆర్ కూడా కౌంటర్ బాగానే ఇచ్చారు. ఐటీఐఆర్ విధానాన్ని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. యూపీఏ ప్రభుత్వం 2013లో బెంగుళూరు - హైదరాబాద్ లో ఐటీఐఆర్ అనుమతి ఇచ్చిందన్నారు. కానీ ఐటీఐఆర్ ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా యూపీఏ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. అయినా ఆఫీసు స్పేస్ ఆక్యుపెషన్ లో బెంగళూరును హైదరాబాద్ దాటిందన్నారు. ఢిల్లీ పెద్దలు ఉద్ధరిస్తారని తాము చూడట్లేదన్నారు. మా పని మేము చేసుకుని పోతున్నా మన్నారు. ఐటీఐఆర్ కోసం కాంగ్రెసోళ్లేదో ఉద్ధరించినట్లు...తామేదో నాశనం చేసినట్టు మాట్లాడం సరికాదని హితవు పలికారు.
కేటీఆర్ - భట్టిల మధ్య వాగ్యుద్దం జోరుగా సాగింది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ తరఫున భట్టి విరుచుకుపడుతున్న తీరుతో కాంగ్రెస్ సభలో గట్టి వాయిస్ వినిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఉద్యోగాల కోసమేనని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ఐటీ రంగంలో అభివృద్ధి చెందాలనే యూపీఏ ప్రభుత్వం ఐటీఐఆర్ ను మంజూరు చేసిందని గుర్తుచేశారు. దీనికి ప్రతిగా.. ఐటీఐఆర్ విషయంలో యూపీఏ ఒక కాగితం పారేసి పోయిందని దెప్పిపొడిచారు. ఇకనైనా కాంగ్రెస్ నేతలు విమర్శలు మాని అభినందించడం నేర్చుకోవాలని కేటీఆర్ చురకలంటించారు. మొత్తానికి శనివారం నాటి తెలంగాణ అసెంబ్లీ ఈ ఇద్దరు నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో హోరెత్తిపోయింది.