Begin typing your search above and press return to search.
నిమ్మకూరు బీహెచ్ ఈఎల్ లో ఏం తయారు చేస్తారు?
By: Tupaki Desk | 22 April 2016 7:09 AM GMTరాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థికంగా ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతరం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. తెలంగాణకు హైదరాబాద్ మహానగరం ఉండటం.. ఏపీలో ఆ స్థాయి నగరం లేకపోవటం పెద్ద లోటుగా మారిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మహానగరంలో భారీ కంపెనీలు.. పరిశోధక సంస్థలు ఎక్కువ. వీటితో పోల్చినప్పుడు ఏపీలో ఏమీ లేవనే చెప్పాలి. ఈ లోటును తీరుస్తూ.. కొన్ని ప్రముఖ సంస్థల్ని ఏపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఏపీ సర్కారు. తాజాగా అలాంటి అడుగే ఒకటి పడింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఏపీలో అడుగుపెడుతోంది.
కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఈ పరిశ్రమ తన కర్మాగారాన్ని నిర్మిస్తోంది. తెలుగువారి ముద్దుబిడ్డ అయిన ఎన్టీవోడు స్వగ్రామమైన నిమ్మకూరులో ఈ ప్రఖ్యాత సంస్థ తన ఫ్లాంట్ ను ఏర్పాటు చేస్తోంది. ఇంతకీ బీహెచ్ఈఎల్ కంపెనీ నిమ్మకూరుకే ఎందుకు వస్తోందన్న విషయాన్ని చూస్తే.. ఈ ఊరును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ దత్తత తీసుకున్నారు. తాను దత్తత తీసుకున్న ఊరిని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లటంతో పాటు.. చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రయత్నాలు చేపట్టారు. దాని ఫలితమే నిమ్మకూరులో భెల్ సంస్థ ఏర్పాటు కావటం.
ఇంతకీ నిమ్మకూరులో పెట్టే భెల్ లో ఏం తయారు చేస్తారన్నది ఆసక్తికరం. ఇక్కడ నైట్ విజన్ గ్లాసెస్ ను తయారు చేస్తారు. 50 ఎకరాల స్థలంలో ఏర్పాటు అవుతున్న ఈ సంస్థ.. దశల వారీగా పలు ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేయనుంది. తొలిదశ నిర్మాణం పూర్తి చేయటానికి ఏడాదిన్నర పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇజ్రాయిల్ సంస్థ భాగస్వామ్యంతో భెల్ మలిదశను వృద్ధి చేస్తారంటున్నారు. భెల్ రాకతో దాదాపు వెయ్యి మందికి పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నట్లు చెబుతున్నారు. ఒక ప్రయత్నం ఎంతోకొంత మేలు చేస్తుందనటానికిదో నిదర్శనం.