Begin typing your search above and press return to search.
ఇంకో రికార్డులో మోడీ భాగస్వామ్యం
By: Tupaki Desk | 3 Jan 2017 7:38 AM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ మానసపుత్రికలుగా రూపుదిద్దుకుంటున్న పలు పథకాలు ప్రజా సంక్షేమం కోణంలో ముందుకు సాగుతూనే అదే సమయంలో విశిష్ట రికార్డులను సైతం నమోదు చేసుకుంటున్నాయి. స్వల్పకాలంలో రికార్డు స్థాయిలో జన్ ధన్ ఖాతాలు తెరవడం ఇలాంటిదే. గతంలో ఇలాంటి ప్రత్యేకతను సంపాదించుకోగా...ఇపుడు ఆన్ లైన్ చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ (భీమ్) యాప్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన అండ్రాయిడ్ యాప్ గా ఘనతను సొంతం చేసుకుంది.
గతనెల 30వ తేదీన భీమ్ యాప్ ను ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించి దానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టారు. ప్రధాని ఆవిష్కరించిన తర్వాత కేవలం 48 గంటల్లోనే ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో టాప్ గా నిలిచింది. ఈ యాప్ వినియోగానికి మొబైల్ ఫోన్ లో ఇంటర్నెట్ సౌకర్యం ఉండాల్సిన అవసరం లేదని ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని వెల్లడించారు. చిన్న వ్యాపారులకు - రైతులకు - మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు ఉపయోగకరంగా ఉంటుందని, అందుకే బడుగు వర్గాలకు సేవలందించిన మహనీయుడి పేరును పెట్టామని తెలిపారు. ఇప్పటికే 30 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొన్నారని, దాదాపు 5 లక్షల లావాదేవీలు జరిగాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, అండ్రాయిడ్ యూజర్లకే అందుబాటులో ఉంది. త్వరలోనే ఆపిల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఐవోఎస్ లో కూడా అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/